...
...
Next Story

సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్

సాయి పల్లవితో మాట్లాడిన తర్వాత తన జీవితం ఎలా మారిపోయిందో చెప్పాడు మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. విరాట పర్వం మూవీ నుంచి మొదట తనను తొలగించినా.. తర్వాత ఎలా తిరిగి వచ్చానో, ఆ తర్వాత మందు మానేసి ఎలా తనను తాను నిరూపించుకున్నానో అతడు చెప్పాడు.

Published on: Dec 3, 2025, 16:26:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

'విరాట పర్వం', 'నీదీ నాదీ ఒకే కథ', ఇటీవల వచ్చిన '90s' వెబ్ సిరీస్ వంటి అద్భుతమైన ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. అయితే అతడు తన కెరీర్‌లో ఒక దశలో మందుకు బానిసై తీవ్రంగా పోరాడాడన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ఇటీవల 'గుల్టే' (Gulte)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సురేష్ దీనిపై తన పోరాటం గురించి బహిరంగంగా మాట్లాడాడు. నటి సాయి పల్లవి నుంచి వచ్చిన ఒకే ఒక్క ఫోన్ కాల్, తాను మందు మానేయడానికి ఎలా ప్రేరణనిచ్చిందో వివరించాడు.

సాయి పల్లవి వల్లే సురేష్‌ జీవితంలో మలుపు

సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్
సాయి పల్లవి ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది.. మందు మానేశాను.. నన్ను నేను నిరూపించుకున్నాను: మ్యూజిక్ డైరెక్టర్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటించిన 'విరాట పర్వం' (2022) సినిమా సమయంలో సురేష్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. అయితే తిరిగి అతన్నే తీసుకోవాలని సాయి పల్లవి పట్టుబట్టిందట. "సాయి పల్లవి గారు నన్ను ఎంతగానో నమ్మారు. నా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుందని, దాన్నే వాడాలని ఆమె గట్టిగా చెప్పారు" అని సురేష్ తెలిపాడు.

సినిమా ఫైనల్ స్కోర్ పూర్తి చేసిన తర్వాత సాయి పల్లవి నుంచి తనకు ఫోన్ వచ్చిందని సురేష్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదో అతడు వివరించాడు. "సినిమా విడుదలయ్యాక అందరికంటే ముందు మంచి పేరు తెచ్చుకునేది మీరేనని ఆమె చెప్పారు. నేను అద్భుతంగా పనిచేశానని, ఇకపై పనిపైనే దృష్టి పెట్టాలని, మిగిలినవన్నీ వదిలేయాలని ఆమె సూచించారు. అప్పటికే ఆమె పెద్ద స్టార్. అలాంటి వ్యక్తి నాలో ప్రతిభను గుర్తించడం నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పరిశ్రమకు ఎందుకు వచ్చాను అనేది నాకు గుర్తుచేసింది" అని సురేష్ అన్నాడు.

నరకం చూశాను.. కానీ గెలిచాను

ఆ క్షణంలో తనకు వచ్చిన అవకాశాలు, తన ప్రతిభ ఎంత విలువైనవో తాను గుర్తించినట్లు సురేష్ చెప్పాడు. తాను తప్పుడు మార్గంలో వెళ్తున్నానని గ్రహించి, సినిమా విడుదలైన తర్వాత మద్యం మానేశాడు. ఆ తర్వాత మూడు నెలల పాటు విత్‌డ్రావల్ సింప్టమ్స్ వల్ల "నరకం చూశాను" అని అతడు తెలిపాడు. అయితే ఆ కష్టాన్ని అధిగమించి, గత మూడేళ్లుగా తాను మద్యానికి పూర్తిగా దూరంగా ఉన్నట్లు సురేష్ తెలిపాడు.

సాయి పల్లవి కెరీర్ ఇలా..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks