Thriller Web Series: క్యాంపస్‌లో డెడ్లీ గేమ్.. కవల సోదరి హత్యకు ప్రతీకారం.. ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్
Thriller Web Series: కరణ్ జోహార్ తన ఐకానిక్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'ను సరికొత్త డార్క్ అండ్ గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజైంది.
Thriller Web Series: బాలీవుడ్‌లో గ్లామర్, కాలేజ్ రొమాన్స్, డ్యాన్స్ పోటీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఐకానిక్ ఫ్రాంచైజీ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (SOTY). అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ సినిమాను ఇప్పుడు ప్రముఖ మేకర్ కరణ్ జోహార్ ఓటీటీలోకి సరికొత్త రూపంలో తీసుకువస్తున్నారు.

ఇప్పటివరకు మనం చూసిన కాలేజ్ గ్లామర్‌ను పక్కనపెట్టి.. ద్రోహం, అసూయ, సీక్రెట్స్, దారుణమైన హత్యల బ్యాక్‌డ్రాప్‌లో డార్క్ మిస్టరీ థ్రిల్లర్‌గా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (Student of the Year: After Dark) పేరుతో వెబ్ సిరీస్ ను రూపొందించారు.
వైరల్‌గా ట్రైలర్
తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. నెట్టింట ఇది మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. రీమా మాయా (Reema Maya) దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో బాలీవుడ్ బ్యూటీ శనయా కపూర్ ద్విపాత్రాభినయంలో నటించగా, ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ ను నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'జియోహాట్‌స్టార్' (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ ఇలా.. కవల సోదరి హత్య.. క్యాంపస్‌లో డెడ్లీ గేమ్
ట్రైలర్ పరిశీలిస్తే.. సెయింట్ థెరెసా హెరిటేజ్ స్కూల్‌లో అత్యంత పాపులర్ అయిన ఆయేషా మాలిక్ (శనయా కపూర్) విగతజీవిగా పడి ఉండటంతో కథ ప్రారంభమవుతుంది. ఆమెది అనుమానాస్పద మరణం అని, దాని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందని ఆయేషా కవల సోదరి అదితి (శనయా కపూర్) నమ్ముతుంది. తన సోదరి హత్య వెనుక ఉన్న నిజాలను బయటకు తీయడానికి అదితి అదే స్కూల్‌లో విద్యార్థిగా చేరి, అక్కడి మోస్ట్ కాంపిటీటివ్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' పోటీల్లో అడుగుపెడుతుంది.
అయితే ఆ ఇన్వెస్టిగేషన్‌లో అదితికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. తన సోదరి ఆయేషాకు అత్యంత ఆప్తులుగా ఉన్న స్నేహితులే ఆమెకు ప్రధాన శత్రువులని గ్రహిస్తుంది. టైటిల్ గెలవడమే ఏకైక లక్ష్యంగా మారిన ఆ క్యాంపస్‌లో హత్య చేసిన నిందితుడు ఎవరో కనిపెడుతూనే, అదితి ఆ ప్రమాదకరమైన పోటీల్లో ఎలా గెలిచింది అనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం.
"నెట్‌ఫ్లిక్స్ ఎలైట్, స్క్విడ్ గేమ్ మిక్సింగ్‌లా ఉంది!"
ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ఆడియెన్స్ నుంచి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. హాలీవుడ్ హిట్ వెబ్ సిరీస్‌లు 'రివర్ డేల్', '13 రీజన్స్ వై', 'ఎలైట్', ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'స్క్విడ్ గేమ్' కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ఈ సిరీస్‌ను తీసినట్లు ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ట్రైలర్‌ను షేర్ చేస్తూ కరణ్ జోహార్.. "సెయింట్ థెరెసా స్కూల్‌లో ఒక నయా శకం ప్రారంభమైంది. మీరు నిజానికి ఎంత దగ్గరగా వెళితే, అంత ప్రమాదకరంగా మారుతుంది" అని క్యాప్షన్ ఇచ్చారు.
నా కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న పాత్ర: శనయా కపూర్
ఈ సిరీస్ గురించి శనయా కపూర్ మాట్లాడుతూ.. "ఆయేషా, అదితి అనే ఇద్దరు కవల సోదరీమణుల పాత్రలలో నటించడం నా నటనా జీవితంలో అత్యంత కష్టమైన, అదే సమయంలో సంతృప్తినిచ్చిన అనుభవం. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉన్నప్పటికీ వారి ప్రవర్తన, ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కేవలం పోటీలు, గెలుపు మాత్రమే కాకుండా ఒక పాపులర్ ఫ్రాంచైజీని సరికొత్త డార్క్ అడ్వెంచర్‌లోకి తీసుకెళ్లిన తీరు నాకు బాగా నచ్చింది" అని చెప్పారు.
అభినవ్ సింగ్, దివిక్ శర్మ, మాన్యా గ్రోవర్, దీయా దమానీ, షీబా చద్దా, వివేక్ గోంబర్ కీలక పాత్రల్లో నటించిన ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లర్ సిరీస్ రాబోయే నవంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


