...
...
Next Story

Nabha Natesh: నాగబంధం కోసం వెజిటేరియన్ డైట్.. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్.. 5 వేల మందితో సాంగ్: నభా నటేష్

Nabha Natesh: నభా నటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నాగబంధం. ఈ సినిమా ఈవారమే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ గురించి ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. భారీ పద్మనాభస్వామి ఆలయం సెట్, వెజిటేరియన్ డైట్ లాంటివి ఇందులో ఉన్నాయి.

Published on: Jun 29, 2026, 18:56:56 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nabha Natesh: నభా నటేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సోషియో మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘నాగబంధం’ (Nagabandham: The Secret Treasure) జులై 3న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. యంగ్ హీరో విరాట్ కర్ణ హీరోగా, ప్రముఖ నిర్మాత కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.

Nabha Natesh: నాగబంధం కోసం వెజిటేరియన్ డైట్.. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్.. 5 వేల మందితో సాంగ్: నభా నటేష్
Nabha Natesh: నాగబంధం కోసం వెజిటేరియన్ డైట్.. అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్.. 5 వేల మందితో సాంగ్: నభా నటేష్

ఈ పీరియాడిక్ విజువల్ వండర్ ప్రమోషన్స్ స్పీడప్ చేసిన టీమ్.. తాజాగా హీరోయిన్ నభా నటేష్ ఇంటర్వ్యూను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో తను పోషించిన ‘పార్వతి’ క్యారెక్టర్ తన కెరీర్‌లోనే ది బెస్ట్, పవర్‌ఫుల్ రోల్ అంటూ నభా చెప్పుకొచ్చింది.

అనంత పద్మనాభస్వామి టెంపుల్ సెట్..

నాగబంధం సినిమా విజువల్ గ్రాండియర్ గురించి నభా నటేష్ మాట్లాడుతూ.. నాగబంధం థియేటర్లలో ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని నమ్మకం వ్యక్తంచేసింది. కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి టెంపుల్ లాంటి ఒక భారీ సెట్‌ను ప్రొడక్షన్ డిజైనర్ అశోక్ కుమార్ నేతృత్వంలో అద్భుతంగా డిజైన్ చేశారు. ఆ టెంపుల్ సెట్ లోపలికి అడుగుపెట్టగానే ఒక తెలియని దైవికమైన వైబ్స్ కనిపించాయని నభా గుర్తుచేసుకుంది.

బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాస్టర్ పర్యవేక్షణలో ఏకంగా 5000 మంది డాన్సర్లతో ఒక భారీ డివోషనల్ సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేశారు. ఈ వీర నాగ తాండవం సాంగ్ కేవలం డాన్స్ నెంబర్ లాగా కాకుండా.. ఒక భారీ ఆధ్యాత్మిక అనుభూతి స్క్రీన్ పై కనిపించబోతోంది.

టెంపుల్ సెట్‌లో వెజిటేరియన్ డైట్ రూల్..

డైరెక్టర్ అభిషేక్ నామా పక్కా స్టోరీ బోర్డ్ ప్లానింగ్‌తో సెట్‌లోకి రావడం వల్లే ఇంత భారీ బడ్జెట్ సినిమాను చాలా పర్‌ఫెక్ట్‌గా, ఎలాంటి అయోమయం లేకుండా అనుకున్న టైమ్‌కి పూర్తి చేయగలిగామని డైరెక్టర్‌ను ప్రశంసించింది.

కేవలం గ్లామర్ రోల్ కాదు.. కథను మలుపు తిప్పే ట్విస్ట్

ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్.. నాగబంధం సినిమాలో తన రూట్ మార్చింది. ఈ సినిమాలో తను పోషించిన పార్వతి క్యారెక్టర్ సాంప్రదాయబద్ధంగా ఉంటూనే.. ఒక గొప్ప ధైర్యం ఉన్న మహిళగా కనిపిస్తుందని చెప్పింది. కథలోని ముఖ్యమైన ట్విస్టులు, కీలకమైన మలుపులు అన్నీ కూడా పార్వతి తీసుకునే నిర్ణయాల చుట్టూనే తిరుగుతాయి.

హీరో విరాట్ కర్ణ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పని చేశాడని, ప్రతీ యాక్షన్ సీన్ లోనూ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చాడని కొనియాడింది. అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్ జులై 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe