Naga Chaitanya: సిక్స్ ప్యాక్ బాడీతో నాగ చైతన్య.. జిమ్ వర్కౌట్ ఫొటో షేర్ చేసిన స్టార్.. వైరల్ అవుతున్న కొత్త లుక్

Naga Chaitanya: నాగ చైతన్యను ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా చూశారా? వృషకర్మ మూవీ కోసం చైతూ పూర్తిగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ బాడీతో బీస్ట్ లుక్ రెడీ చేస్తున్నాడు. ఈ ఫొటోను అతడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

Mar 12, 2026, 13:46:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాగ చైతన్య పేరు వినిపించగానే ఓ సాఫ్ట్, లవర్ బాయ్ మన కళ్ల ముందు కనిపిస్తుంటాడు. కెరీర్లో కొన్ని మాస్ పాత్రలు చేసినా.. అతడు ఎప్పుడూ తన షర్ట్ లెస్ ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. అయితే తాజాగా వృషకర్మలో అర్జున్ పాత్ర కోసం ఫిజికల్ గా తాను ఎంతలా మారిపోయాడో చెబుతూ ఓ ఫొటోను అతడు షేర్ చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్ ను బ్రేక్ చేస్తోంది. సిక్స్ బాడీతో ఉన్న షర్ట్ లెస్ ఫొటో చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Naga Chaitanya: సిక్స్ ప్యాక్ బాడీతో నాగ చైతన్య.. జిమ్ వర్కౌట్ ఫొటో షేర్ చేసిన స్టార్.. వైరల్ అవుతున్న కొత్త లుక్
Naga Chaitanya: సిక్స్ ప్యాక్ బాడీతో నాగ చైతన్య.. జిమ్ వర్కౌట్ ఫొటో షేర్ చేసిన స్టార్.. వైరల్ అవుతున్న కొత్త లుక్

జిమ్‌లో నాగ చైతన్య 'అర్జున్' అవతారం

నాగ చైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే మూవీ చేస్తున్న విషయం తెలుసు కదా. ఈ మధ్యే మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం చైతూ పూర్తిగా మారిపోయాడు. తాజాగా జిమ్‌లో చేతిలో డంబెల్స్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్ తో ఉన్న చైతన్య ఆ ఫోటోను షేర్ చేస్తూ.. “బీయింగ్ అర్జున్” అని క్యాప్షన్ ఇచ్చాడు.

'వృషకర్మ' (Vrushakarma) లోని తన పాత్ర పేరు అర్జున్ అని, ఈ మాస్ మేకోవర్ ఆ సినిమా కోసమేనని దీనిబట్టి స్పష్టమవుతోంది. చైతన్య తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇటువంటి ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయడం ఇదే మొదటిసారి.

దీనిపై స్పందించిన చైతన్య ఫిట్‌నెస్ ట్రైనర్.. "మీ కొత్త లుక్‌లో నా వంతు పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది" అని గర్వంగా కామెంట్ చేశారు. నటుడు సుశాంత్ సహా వేలాది మంది అభిమానులు ఫైర్ ఎమోజీలతో చైతన్య కొత్త లుక్‌ను కొనియాడుతున్నారు. "వృషకర్మ ఇన్ యాక్షన్", "అన్నా.. సినిమా కోసం వెయిటింగ్" అంటూ మెగాస్టార్ రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్.

'వృషకర్మ' మూవీ విశేషాలు

నాగ చైతన్య కెరీర్లో మరోసారి ఓ డిఫరెంట్ జానర్ ట్రై చేస్తున్నాడు. వృషకర్మ ఓ మిథికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇందులో చైతూ ట్రెజర్ హంటర్ పాత్రలో కనిపించనున్నాడు. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సుకుమార్ రైటింగ్స్, బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. జయరామ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అత్యాధునిక విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. తండేల్ తో తన కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చైతూ.. ఈ వృషకర్మతో మరో మెట్టు ఎక్కబోతున్నాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More