...
...
Next Story

Nagabandham Trailer: పద్మనాభస్వామి గుడి రహస్యాలు.. బ్రహ్మకమలాన్ని కాపాడే నాగసాధువుల యుద్ధం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్

Nagabandham Trailer: మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ నాగబంధం ట్రైలర్ శుక్రవారం (జూన్ 19) రిలీజైంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్.. కళ్లు చెదిరే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఆకట్టుకుంటోంది.

Published on: Jun 19, 2026, 17:56:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nagabandham Trailer: తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, శతాబ్దాల నాటి చరిత్ర, పురాణాల బ్యాక్‌డ్రాప్‌లో టాలీవుడ్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న హై-బడ్జెట్ విజువల్ వండర్ 'నాగబంధం'.

Nagabandham Trailer: పద్మనాభస్వామి గుడి రహస్యాలు.. బ్రహ్మకమలాన్ని కాపాడే నాగసాధువుల యుద్ధం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్
Nagabandham Trailer: పద్మనాభస్వామి గుడి రహస్యాలు.. బ్రహ్మకమలాన్ని కాపాడే నాగసాధువుల యుద్ధం.. మైండ్ బ్లోయింగ్ విజువల్స్

ఈ సినిమా అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ ట్రైలర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. రొటీన్ మైథలాజికల్ సినిమాలకు భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా.. జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

నాగబంధం మూవీ కథేంటంటే?

ఈ నాగబంధం సినిమా కథ మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అనంత పద్మనాభస్వామి దేవాలయం చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఎవరూ ఊహించని శక్తులు, అమూల్యమైన ప్రాధాన్యత కలిగిన దైవిక శక్తులు ఉన్న రహస్య 'బ్రహ్మ కమలం' చుట్టూ ఈ మిస్టరీ అల్లుకుని ఉంది. పురాతన కాలం నాటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో.. ఆ దైవిక నిధిని, బ్రహ్మకమలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఒక శక్తివంతమైన దుష్టశక్తి సమాజంపై దాడికి దిగుతుంది.

ఆ రాక్షస శక్తుల నుండి దేవుడి నిధిని కాపాడటానికి స్వయంగా భగవంతుడి ఆజ్ఞతో నాగసాధువులు రంగంలోకి దిగుతారు. ఈ భయంకరమైన యుద్ధంలో అసలు నాగబంధం రహస్యం ఏంటి, ఆ అపారమైన దైవ సంపదను దుష్టుల చేతికి చిక్కకుండా ఎలా కాపాడారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్.

విజువల్ వండర్.. అభిషేక్ నామా టేకింగ్

సౌందర్ రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా నిలవగా, జునైద్ కుమార్ అందించిన డివోషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను అద్భుతంగా ఎలివేట్ చేస్తూ ప్రేక్షకులలో భక్తితో కూడిన గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ ఎండింగ్ కార్డ్‌లో చూపించిన నాగబంధం విజువల్ ఎఫెక్ట్స్ థియేటర్లలో విజువల్ ఫీస్ట్ ఇవ్వడం ఖాయం అనిపిస్తోంది.

విరాట్ కర్ణ మేకోవర్.. నభా నటేష్ కమ్‌బ్యాక్

ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విరాట్ కర్ణ తన స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ రోల్ కోసం అతడు ఫిజికల్‌గా చాలా చేంజ్ అయ్యాడు. ముఖ్యంగా ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌తో పాటు స్పిరిచువల్ డెప్త్ ఉన్న సీన్లలో చాలా మెచ్యూర్డ్‌గా నటించాడు. ఇక చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తోంది.

ఆమెతో పాటు గ్లామరస్ హీరోయిన్లు ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరికి తోడుగా వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, మురళీ శర్మ, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ లాంటి భారీ తారాగణం ఉండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో సాలిడ్ బిజినెస్ క్రేజ్ ఏర్పడింది.

ఎన్ఐకే స్టూడియోస్ బ్యానర్‌పై ఎలాంటి రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ అడ్వెంచర్ మూవీ, టాలీవుడ్‌లో మైథలాజికల్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంది. జులై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ 'నాగబంధం' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks