...
...
Next Story

Nagarjuna Digital Arrest: నాగార్జునకూ డిజిటల్ అరెస్ట్ సెగ.. ఆ కాల్ వచ్చినప్పుడు తాను ఏం చేశానో చెప్పిన కింగ్

Nagarjuna Digital Arrest: డిజిటల్ అరెస్ట్ సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ తప్పడం లేదు. తాజాగా నాగార్జున దీనికి సంబంధించి తనకు ఎదురైన అనుభవం గురించి షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఏం చేశానో కూడా వెల్లడించారు.

Published on: Aug 14, 2026, 14:39:34 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Nagarjuna Digital Arrest: నాగార్జున కుటుంబంలో తీవ్ర కలకలం రేపిన ఒక సైబర్ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కినేని నాగార్జున తనకు అత్యంత దగ్గరి బంధువు ఒకరు సైబర్ కేటుగాళ్ల వలలో పడి ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు 'డిజిటల్ అరెస్ట్'కు గురైన షాకింగ్ ఘటనను బయటపెట్టారు. కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసిన స్కామర్లు, ఆ తర్వాత పోలీసుల అవతారం ఎత్తి ఎలా భయపెట్టారో ఆయన క్లియర్‌గా వివరించారు.

గంటల పాటు డిజిటల్ భయం.. అసలు ఏం జరిగింది?

Nagarjuna Digital Arrest: నాగార్జునకూ డిజిటల్ అరెస్ట్ సెగ.. ఆ కాల్ వచ్చినప్పుడు తాను ఏం చేశానో చెప్పిన కింగ్
Nagarjuna Digital Arrest: నాగార్జునకూ డిజిటల్ అరెస్ట్ సెగ.. ఆ కాల్ వచ్చినప్పుడు తాను ఏం చేశానో చెప్పిన కింగ్

నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. ఈ హైడ్రామా ఒక ఫేక్ ఫోన్ కాల్‌తో స్టార్ట్ అయింది. సదరు బంధువు పేరు మీద ఇరాన్ దేశానికి ఒక కొరియర్ పార్సిల్ వెళ్తోందని, అందులో నిషేధిత డ్రగ్స్ (నార్కోటిక్స్) ఉన్నాయని కస్టమ్స్ ఆఫీసర్ల పేరుతో కేటుగాళ్లు బెదిరించారు.

వెంటనే 'పోలీస్ డిపార్ట్‌మెంట్' నుంచి మాట్లాడేస్తున్నామంటూ మరో కాల్ వచ్చింది. ఆ తర్వాత పోలీసు యూనిఫామ్ ధరించిన ఒక వ్యక్తి వీడియో కాల్‌లోకి వచ్చి, ఆమెను ఇల్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆర్డర్ వేశాడు. ప్యాకేజీలో డ్రగ్స్ దొరికాయని, ఇల్లు వదిలి వెళ్తే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తూ దాదాపు 6 నుంచి 7 గంటల పాటు ఆమెను 'డిజిటల్ అరెస్ట్' చేసి తీవ్ర భయాందోళనకు గురిచేసినట్లు నాగార్జున వెల్లడించారు. అయితే ఆమె సమయస్ఫూర్తితో సైబర్ క్రైమ్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పడంతో ఆ క్రైమ్ అక్కడితో ఆగిపోయిందన్నారు.

నాగార్జున పేరు, అడ్రస్‌తో నాకే ఫోన్లు వచ్చాయి

ఈ రకమైన స్కామ్‌లు కేవలం తన బంధువులకే కాదు, తనకు కూడా ఎదురయ్యాయని కింగ్ నాగార్జున సంచలన నిజాలు వెల్లడించారు. తన పేరు, సొంత ఇంటి అడ్రస్ చెప్పి మరీ స్కామర్లు ఫోన్ కాల్స్ చేశారని, అవతలి వ్యక్తి నమ్మేలా మాట్లాడటంలో వీళ్లు చాలా ఎక్స్‌పర్ట్స్ అని ఆయన అన్నారు.

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ క్రిమినల్స్ ఉపయోగిస్తున్న ప్రధానమైన అస్త్రం ఈ డిజిటల్ అరెస్ట్. సీబీఐ, ఈడీ, కస్టమ్స్ లేదా పోలీస్ అధికారులమని చెప్పి ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోబెట్టడమే ఈ మోసం వెనుక ఉన్న ప్లాన్.

వీడియో కాల్స్ ద్వారా బాధితులను సైకలాజికల్‌గా భయపెట్టి లక్షలాది రూపాయలు అకౌంట్ల నుంచి లాగేస్తుంటారు. పోలీసులు లేదా ఏ ఇతర ప్రభుత్వ సంస్థలూ వాట్సాప్ లేదా స్కైప్ వీడియో కాల్స్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ అరెస్ట్ ఇలా..

ప్రధాన బాధితులు : సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్

వాడే ఎత్తుగడలు : కస్టమ్స్ పార్సిల్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ బెదిరింపులు

కాల్ రకాలు : వాట్సాప్ / ఐవీఆర్ డిజిటల్ వీడియో కాల్స్

తీసుకోవాల్సిన జాగ్రత్త : ఎలాంటి వీడియో కాల్స్ నమ్మవద్దు, భయపడవద్దు

హెల్ప్‌లైన్ నంబర్ : సైబర్ క్రైమ్ నేషనల్ నంబర్ 1930

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe