Mokshagnya Debut: నంద‌మూరి ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధ‌మాకా..బాల‌కృష్ణ వార‌సుడు మోక్షజ్ఞ డెబ్యూ..క్రేజీ మూవీ..డైరెక్టర్ ఎవరంటే?

Mokshagnya Debut: నందమూరి ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా. ఒకవైపు బాల‌కృష్ణ కొత్త సినిమా టైటిల్ దాదాను అనౌన్స్ చేశారు. మరోవైపు బాల‌కృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞ సినీ డెబ్యూపై బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. అతని ఫస్ట్ మూవీ టీమ్ ను ఇవాళ ప్రకటించారు.

Published on: Sep 6, 2026, 19:47:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mokshagna Debut: నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) సిల్వర్ స్క్రీన్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా అతని డెబ్యూ మూవీని అనౌన్స్ చేశారు.

నంద‌మూరి ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధ‌మాకా..బాల‌కృష్ణ వార‌సుడు మోక్షజ్ఞ డెబ్యూ..క్రేజీ మూవీ..డైరెక్టర్ ఎవరంటే? (x/MythriOfficial)
నంద‌మూరి ఫ్యాన్స్‌కు డ‌బుల్ ధ‌మాకా..బాల‌కృష్ణ వార‌సుడు మోక్షజ్ఞ డెబ్యూ..క్రేజీ మూవీ..డైరెక్టర్ ఎవరంటే? (x/MythriOfficial)

మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్

గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎట్టకేలకు అప్డేట్ వచ్చేసింది. 'బింబిసార'తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా, మెగాస్టార్ చిరంజీవితో 'విశ్వంభర'ను తెరకెక్కిస్తున్న విజనరీ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ చేయబోతున్నాడు.

ప్రొడ్యూసర్ వీళ్లే

టాలీవుడ్‌లో వరుసగా రూ. 1000 కోట్ల పాన్ ఇండియా హిట్లు అందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మోక్షజ్ఞ లాంఛ్ కాబోతున్నాడు. నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఇటీవల బాలకృష్ణ, మోక్షజ్ఞలతో దర్శకుడు వశిష్ఠ, నిర్మాతలు భేటీ అయిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నికల్ క్రూ వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.

‘దాదా’గా వస్తున్న బాలయ్య

మరోవైపు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతన్న ఎన్బీకే 111 మూవీ టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మూవీకి ‘దాదా’ అనే పేరు పెట్టారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రానికి పవర్‌ఫుల్ అండ్ మాస్ టైటిల్‌ను లాక్ చేశారు.

ఆ సెంటిమెంట్

ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. డిసెంబర్ నెల బాలకృష్ణకు ('అఖండ', 'అఖండ 2' విజయాలతో) సెంటిమెంట్‌గా కలిసిరావడంతో ఈ డేట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వశిష్ఠనే ఎందుకు?

ఒక స్టార్ కిడ్ అరంగేట్రం చేసేటప్పుడు సాధారణ మాస్ ఫార్ములా లేదా రొటీన్ లవ్ స్టోరీని ఎంచుకోవడం సహజం. కానీ నందమూరి మోక్షజ్ఞ కోసం వశిష్ఠను ఎంచుకోవడం వెనుకున్న ఇండస్ట్రీ స్ట్రాటజీ ఉందనే టాక్ వినిపిస్తోంది. 'బింబిసార' లో టైమ్ ట్రావెల్, 'విశ్వంభర' లో కాన్సెప్ట్ డ్రివెన్ విజువల్స్‌తో ఆకట్టుకున్న వశిష్ఠ.. మోక్షజ్ఞ కోసం ఒక వినూత్నమైన కాన్సెప్ట్-డ్రివెన్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేసినట్లు సమాచారం.

మూడో తరం వారసుడు

నందమూరి మూడో తరం వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం టాలీవుడ్ వ్యాపార వర్గాల్లో సరికొత్త ఊపునిచ్చింది. వశిష్ఠ సబ్జెక్ట్ నాలెడ్జ్, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ స్కేల్ కలవడంతో మోక్షజ్ఞ డెబ్యూ సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారనుంది. మరోవైపు తండ్రి బాలకృష్ణ ‘దాదా’గా డిసెంబర్‌లో రాబోతుండటంతో 2026 ముగింపు నందమూరి అభిమానులకు పండగలా మారనుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More