Nani Anirudh: 'ది పారడైజ్' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేచురల్ స్టార్ నాని, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ అమెరికా వీధుల్లో చేసిన రచ్చ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తెలంగాణ జానపద శైలిలో వచ్చిన 'ఏషనాగుల' పాటపై అమెరికా రోడ్లపై ఇద్దరూ రిక్షా తరహా వాహనంలో ప్రయాణిస్తూ మాస్ స్టెప్పులతో కేక పెట్టించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.
ది పారడైజ్ ప్రమోషన్లు.. రోడ్లపై డ్యాన్స్‌లు

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ది పారడైజ్' (The Paradise). ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ సరికొత్త పంథాను ఎంచుకుంటోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన తెలంగాణ ఫోక్ సాంగ్ 'ఏషనాగుల' (Yeshanagula) ఎంతటి సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా ఈ పాటను యూఎస్ఏ (USA)లోని డల్లాస్‌లో జరిగిన ఒక భారీ మ్యూజిక్ కాన్సర్ట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసిన నాని, అనిరుధ్ రవిచందర్.. తాజాగా అమెరికా వీధుల్లో చేసిన సందడి సోషల్ మీడియాను ఊపేస్తోంది.
అమెరికా వీధుల్లో ఒక రిక్షా తరహా ఓపెన్ వెహికల్ లో ప్రయాణిస్తూ, బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న 'ఏషనాగుల' మాస్ బీట్స్‌కు నాని, అనిరుధ్ పోటీపడి మరీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం, వేలల్లో వ్యూస్, షేర్లతో వైరల్‌గా మారింది. హాలీవుడ్ స్ట్రీట్స్‌లో పక్కా తెలంగాణ ఫోక్ పాటకి మన స్టార్స్ చేసిన ఈ ఎనర్జెటిక్ రచ్చ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
జనంలోకి చొచ్చుకెళ్లిన 'ఏషనాగుల' జానపదం
అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, తెలంగాణ జానపద సోయగాలు మేళవించిన 'ఏషనాగుల' పాట ఆడియన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోయింది. ఈ ప్రత్యేకమైన పాటలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ కూడా మెరవడం విశేషం. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాట.. నాని-అనిరుధ్ల ఈ స్ట్రీట్ డ్యాన్స్ వీడియోతో ప్రమోషనల్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయిందనే చెప్పాలి.
'దసరా' కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
{{/usCountry}}అనిరుధ్ రవిచందర్ అందించిన మాస్ బీట్స్, తెలంగాణ జానపద సోయగాలు మేళవించిన 'ఏషనాగుల' పాట ఆడియన్స్‌కు ఇట్టే కనెక్ట్ అయిపోయింది. ఈ ప్రత్యేకమైన పాటలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ కూడా మెరవడం విశేషం. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాట.. నాని-అనిరుధ్ల ఈ స్ట్రీట్ డ్యాన్స్ వీడియోతో ప్రమోషనల్ పరంగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయిందనే చెప్పాలి.
'దసరా' కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
{{/usCountry}}'దసరా' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల - నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ (Raghav Juyal) విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.