Nani: నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' (The Paradise) బాక్సాఫీస్ దగ్గర రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినప్పటికీ, కంటెంట్ విషయంలో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అయితే తన తదుపరి చిత్రం 'బ్లడీ రోమియో' (Bloody Romeo) గురించి ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. డైరెక్టర్ సుజీత్‌తో చేయబోయే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ కాన్సెప్ట్‌తో ఉండబోతోందని స్పష్టం చేశారు.
'ది పారడైజ్' రూ. 150 కోట్ల రికార్డు.. నాని, శ్రీకాంత్ ఓదెల నేర్చుకున్న పాఠం

షాకింగ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన ‘ది పారడైజ్’.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజే రూ. 76 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటివరకు ఇండియాలో రూ. 100 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ దక్కించుకుంది.
ఈ సినిమా జర్నీ తమకు ఒక పెద్ద పాఠం నేర్పిందని నాని వెల్లడించారు. ఒక సినిమా మేకింగ్‌కు ఎంత టైమ్ పట్టినా, షూటింగ్ కంటే ప్రి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకే 60 నుంచి 70 శాతం సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శ్రీకాంత్ ఓదెల మూడో సినిమా మెగాస్టార్ చిరంజీవితో ఉండబోతోందని, అది కచ్చితంగా ఒక అద్భుతం కాబోతోందని నాని ధీమా వ్యక్తం చేశారు.
ది పారడైజ్ విషయంలో వచ్చిన ట్రోల్స్ గురించి తాను పట్టించుకోనని మరోసారి నాని స్పష్టం చేశారు. ఈ రూ.150 కోట్ల వసూళ్లే తాను ఇచ్చే సమాధానం అని నాని అనడం గమనార్హం.
సుజీత్ 'బ్లడీ రోమియో'.. హింసలో ట్విస్ట్
'సాహో', 'ఓజీ' లాంటి హై-వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుజీత్.. ఈసారి నానితో 'బ్లడీ రోమియో' ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాని మాట్లాడుతూ.. "ఈ జానర్లో ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు, ఇండియన్ స్క్రీన్‌పైనే మనం ఇంతవరకు చూడలేదు" అని చెప్పడం విశేషం.
{{/usCountry}}'సాహో', 'ఓజీ' లాంటి హై-వోల్టేజ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సుజీత్.. ఈసారి నానితో 'బ్లడీ రోమియో' ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ గురించి నాని మాట్లాడుతూ.. "ఈ జానర్లో ఇలాంటి సినిమా తెలుగులోనే కాదు, ఇండియన్ స్క్రీన్‌పైనే మనం ఇంతవరకు చూడలేదు" అని చెప్పడం విశేషం.
{{/usCountry}}'ది పారడైజ్' ఇంటెన్స్ డ్రామాకు ఇది పూర్తి వ్యతిరేకంగా ఉంటుందని నాని పేర్కొన్నారు. ఈ సినిమాలో హింస ఉన్నప్పటికీ సుజీత్ ఒక డిఫరెంట్ విట్టీ ట్విస్ట్‌తో కథను మలిచారని, ప్రతీ ఒక్కరికీ పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుందని చెప్పారు. ఈ క్రేజీ యాక్షన్ డ్రామాలో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ ప్రొడక్షన్.. నాని బిగ్గెస్ట్ లైనప్ ఇదే
కేవలం హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా నాని ఫుల్ బిజీగా మారారు. శ్రీకాంత్ ఓదెల - చిరంజీవి కాంబినేషన్ భారీ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్‌తో కలిసి నాని సమర్పిస్తున్నారు.
మరోవైపు తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలో హిట్ ఫ్రాంచైజీకి చెందిన 'హిట్: ది ఫోర్త్ కేస్' (HIT 4) ను శైలేష్ కొలను దర్శకత్వంలో నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. వరుస విభిన్న కథలతో నాని బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగించడానికి పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు.