Nani Court Order: నెగటివ్ రివ్యూలు ఇస్తే జైలుకేనా? ది పారడైజ్ మూవీ కోర్టు ఆర్డర్‌పై క్లారిటీ ఇచ్చిన నాని
Nani Court Order: నాని నటించిన ది పారడైజ్ మూవీ మేకర్స్ సినిమాపై నెగటివ్ ప్రచారం జరగకుండా ముందే కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న విషయం తెలుసు కదా. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా నాని క్లారిటీ ఇచ్చాడు.
Nani Court Order: థియేటర్లలోకి రాకముందే నెగెటివ్ పీఆర్, ఫేక్ బాట్ రివ్యూలతో కలకలం రేపిన 'ది పారడైజ్' వివాదంపై నాచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరు కోర్టు ఇచ్చిన ఇంజంక్షన్ ఆర్డర్ కేవలం పెయిడ్ డిఫమేటరీ కంటెంట్, AI బాట్‌ల ప్రచారానికి వ్యతిరేకంగా మాత్రమేనని, పక్కాగా రివ్యూలు రాసే ఆడియన్స్‌ని అడ్డుకోదని స్పష్టం చేశారు.

సినిమా రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఇలాంటి లీగల్ స్టే వార్తలు రావడం వల్ల సాధారణ ప్రేక్షకులు, రివ్యూవర్లలో తప్పుడు అపోహలు వస్తాయని భావించిన నాని.. ఈ విషయంపై నేరుగా స్పందించి అందరి అనుమానాలను పటాపంచలు చేశారు.
ముంబై ప్రెస్ మీట్‌లో నాని ఏమన్నారంటే?
'ది పారడైజ్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన నేషనల్ మీడియా సమావేశంలో నాని ఈ కోర్టు ఆర్డర్‌పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. సినిమా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియాలో కావాలని చేసే పెయిడ్ నెగటివ్ ప్రచారాలను, నెగెటివిటీని అడ్డుకోవడమే ఈ కోర్టు ఆర్డర్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
పక్కాగా ఆడియన్స్, ఫిల్మ్ క్రిటిక్స్ ఇచ్చే నిజాయితీ గల అభిప్రాయాలను తాము ఎప్పుడూ స్వాగతిస్తామని నాని వెల్లడించారు. నెగెటివ్ ప్రచారాలతో బాక్సాఫీస్ కలెక్షన్లను దెబ్బతీయాలని చూసే ఫేక్ ఐడీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బాట్ అకౌంట్లపైనే ఈ లీగల్ యాక్షన్ అని క్లియర్‌గా చెప్పారు.
అసలు కోర్టులో ఏం జరిగింది?
ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) సంస్థ బెంగళూరు సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్లు సినిమా ఇమేజ్‌ను, క్రేజ్‌ను దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొంది.
కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి ఇలాంటి కావాలని చేసే ఫేక్ కామెంట్లు, డిఫమేటరీ యూఆర్‌ఎల్‌లు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను పరిశీలించిన కోర్టు, సినిమా రిలీజ్‌కి ముందు కావాలని చేసే ఇష్టారాజ్యమైన ప్రచారాలను అడ్డుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమాకి కూడా ఇలాంటి కోర్టు రక్షణే లభించడం విశేషం.
'దసరా' కాంబో మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
'దసరా' లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కాయాదు లోహర్, సోనాలి కుల్కర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే తొలి రోజే రూ.50 కోట్ల మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ మాస్ సెంటర్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రీమియర్ షో పర్మిషన్ కోసం నాని.. సీఎం రేవంత్ రెడ్డికి ఓపెన్ రిక్వెస్ట్ పెట్టడం కూడా నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అది కుదిరేలా కనిపించడం లేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


