The Paradise: టాక్సిక్ దెబ్బకు జాగ్రత్త పడిన ది పారడైజ్ మూవీ మేకర్స్.. నెగటివ్ ప్రచారం చేస్తే ఇక అంతే.. కోర్టు ఆర్డర్

The Paradise: నాని ది పారడైజ్ మూవీ మేకర్స్ ముందే జాగ్రత్త పడ్డారు. టాక్సిక్ మూవీకి రిలీజ్ తర్వాత పడిన నెగటివ్ ప్రచారం దెబ్బ తమపై పడకుండా ముందే కోర్టు నుంచి రక్షణ పొందారు. ఇక ఈ సినిమాపై పనిగట్టుకొని నెగటివ్ ప్రచారం చేసే వీలుండదు.

Published on: Sep 22, 2026, 15:21:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' గ్రాండ్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం, నెగెటివ్ ట్రోలింగ్‌పై బెంగళూరు కోర్టు గట్టి షాకిచ్చింది. మూవీ రిలీజ్‌కు ముందే హేట్ కంటెంట్, ఫేక్ రివ్యూలను వ్యాప్తి చేయకుండా స్టే విధిస్తూ సంచలన మధ్యంతర ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది.

The Paradise: ఈ మూవీతో పెట్టుకున్నారో ఇక అంతే.. ది పారడైజ్‌పై నెగటివ్ ప్రచారం చేస్తే జైలే: నాని మూవీకి కోర్టు రక్షణ
The Paradise: ఈ మూవీతో పెట్టుకున్నారో ఇక అంతే.. ది పారడైజ్‌పై నెగటివ్ ప్రచారం చేస్తే జైలే: నాని మూవీకి కోర్టు రక్షణ

నెగెటివిటీపై లీగల్ వార్.. కోర్టును ఆశ్రయించిన ప్రొడ్యూసర్స్

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆగస్టు 6న అఫీషియల్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు గుర్తించారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్‌ కోసం రూ. వందల కోట్లు ఇన్వెస్ట్ చేశామని, ఉద్దేశపూర్వకంగా చేసే ఫేక్ ప్రచారం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందని కోర్టుకు వివరించారు.

బెంగళూరు కోర్టు సంచలన తీర్పు..

వాదనలు విన్న జడ్జి, నిర్మాతలు చూపించిన ఆధారాలు పరిశీలించి ఫేక్ కంటెంట్ స్ప్రెడ్ చేస్తున్న వారిపై కఠిన ఆంక్షలు విధించారు. అసలైన విమర్శలు వేరు, కావాలని ఒక సినిమాను డౌన్ చేయడానికి చేసే ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్ వేరు అని కోర్టు స్పష్టం చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఎక్స్, యూట్యూబ్ ఛానెల్స్, ఐడీలలో ఈ రకమైన ఫేక్ న్యూస్, ట్రోల్స్, నెగెటివ్ వీడియోలు టెలికాస్ట్ చేయకూడదని బెంగళూరు కోర్టు అల్టిమేటం జారీ చేసింది. గతంలో కన్నడ స్టార్ యశ్ సినిమా 'టాక్సిక్' కు ఎదురైన వివాదాల అనుభవంతోనే 'ది పారడైజ్' టీమ్ ముందుగానే ఈ లీగల్ చర్యలు తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

శ్రీకాంత్ ఓదెల - నాని 'మాస్ సెంటిమెంట్'.. బాక్సాఫీస్ అంచనాలు

గతంలో వచ్చిన 'దసరా' సినిమా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా అందించిన మాస్ ఎనర్జీతోనే శ్రీకాంత్ ఓదెల ఈసారి మరింత రా, రస్టిక్ కాన్సెప్ట్‌తో 'ది పారడైజ్' చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాలో నానికి జోడీగా కయాదు లోహర్ నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలవబోతోంది.

రిలీజ్ ఆలస్యమైనా.. ప్రమోషన్స్ అదరగొడుతున్న 'త్రీ క్రోస్'

నిజానికి ఈ సినిమా మార్చి లేదా ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉన్నా, గ్రాఫిక్స్, క్వాలిటీ వర్క్ కారణంగా సెప్టెంబర్ 24కి పోస్ట్‌పోన్ అయింది. రీసెంట్‌గా నాని, శ్రీకాంత్ ఓదెల, అనిరుధ్ కలసి 'త్రీ క్రోస్' పేరుతో పోస్టర్ వదిలి ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు.

థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి ఫేక్ నెగెటివిటీ స్ప్రెడ్ కాకుండా లీగల్ ప్రొటెక్షన్ పొందడంతో 'ది పారడైజ్' టీమ్ ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉంది. సెప్టెంబర్ 24న థియేటర్ల ముందుకు వస్తున్న ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More