Nani The Paradise: నా సినిమా ప్రీమియర్ చూడటానికి వెళ్తాను.. అనుమతించండి: సీఎం రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్
Nani The Paradise: ది పారడైజ్ మూవీ రిలీజ్ వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాని ఓ స్పెషల్ రిక్వెస్ట్ పంపించారు. తన సినిమాను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరడం విశేషం.
Nani The Paradise: హైదరాబాద్ మాస్ సినిమా అడ్డా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి తన కొత్త సినిమా 'ది పారడైజ్' ప్రీమియర్ షో చూడాలని నాచురల్ స్టార్ నాని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ పోలీసులకు నాని సోషల్ మీడియా వేదికగా ఓపెన్ రిక్వెస్ట్ పంపారు.

"చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగా".. నాని ఎమోషనల్ పోస్ట్
నాని చేసిన ఈ సడన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మాస్ హబ్‌లో ఫ్యాన్స్ మధ్య ప్రీమియర్ షో చూడటమంటే ఉండే ఆ కిక్కే వేరని, తమ అభిమాన హీరో రిక్వెస్ట్‌కి ప్రభుత్వం వెంటనే ఓకే చెప్పాలని నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 23న జరగబోయే 'ది పారడైజ్' ప్రీమియర్ షోకి సంబంధించిన అనుమతులు ఇవ్వాలని నాని తన పోస్ట్‌లో కోరారు. ఒక సినిమా లవర్‌గా చిన్నప్పటి నుంచి థియేటర్‌లో జనాలతో కలిసి మూవీస్ చూడటం తనకు చాలా ఇష్టమని చెప్పారు. హైదరాబాద్‌లో ఆ మాస్ వైబ్, ఆ ఎనర్జీ కేవలం ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోనే దొరుకుతుందని గుర్తు చేసుకున్నారు.
"ఒక సినిమాను ఎంతో కష్టపడి తీసిన తర్వాత, థియేటర్‌లో ఆడియన్స్ మధ్య కూర్చుని వాళ్ల రెస్పాన్స్ చూడటంలోనే ఒక మేకర్ లేదా యాక్టర్‌కి నిజమైన సంతృప్తి లభిస్తుంది. అందుకే సెప్టెంబర్ 23న క్రాస్ రోడ్స్ థియేటర్‌లో మా ఆడియన్స్‌తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నాను" అని నాని చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వివరించారు.
సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తాం.. పోలీసులకు హామీ
హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీగా ఉండే ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్‌లో నాని లాంటి టాప్ స్టార్ వస్తే విపరీతమైన జనాలు, ట్రాఫిక్ జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గతంలో కొన్ని సినిమాల ప్రీమియర్ల సమయంలో ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాని ముందే అలర్ట్ అయ్యారు.
"పోలీస్ డిపార్ట్‌మెంట్ చెప్పే అన్ని రకాల ప్రొటోకాల్స్, సేఫ్టీ గైడ్‌లైన్స్ మేము ఖచ్చితంగా పాటిస్తాం. పబ్లిక్ సేఫ్టీయే మా మొదటి ప్రాధాన్యత. దయచేసి నా విజ్ఞప్తిని పరిశీలించి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాను" అని నాని తెలంగాణ పోలీసులను, ప్రభుత్వాన్ని కోరారు.
ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ సెంటిమెంట్.. బాక్సాఫీస్ వేట
తెలుగు సినిమా హిస్టరీలో ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌కి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సుదర్శన్, దేవి, సంధ్య లాంటి ఐకానిక్ థియేటర్లలో సినిమా పడిందంటే కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. నాని కూడా తన కెరీర్ ఆరంభం నుంచి ఈ థియేటర్లతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే 'దసరా', 'హాయ్ నాన్న', 'సరిపోదా శనివారం' లాంటి వరుస సక్సెస్ లతో జోరు మీదున్న నాని, ఇప్పుడు 'ది పారడైజ్' చిత్రంతో సరికొత్త రికార్డులపై కన్నేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాని విజ్ఞప్తిపై స్పందించి పర్మిషన్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పర్మిషన్ వస్తే మాత్రం సెప్టెంబర్ 23న ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఫ్యాన్స్ సంబరాలు ఆపడం ఎవరి వల్ల కాదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


