The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise) చుట్టూ గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసత్య ప్రచారాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, కొన్ని కీలక సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరిస్తున్నారంటూ (Reshoots) వస్తున్న వార్తలను మేకర్స్ తీవ్రంగా ఖండించారు.
పుకార్లకు తావులేదు.. అంతా ప్లాన్ ప్రకారమే

సినిమా నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న వార్తలపై 'ది ప్యారడైజ్' అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. "గత కొద్దిరోజులుగా మా సినిమాపై వస్తున్న నిరాధారమైన పుకార్లను గమనిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ మొదటి రోజు నుంచి అత్యంత స్పష్టతతో సాగుతోంది. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. మిగిలిన షెడ్యూల్ కూడా అనుకున్న సమయానికే జరుగుతుంది" అని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
ముఖ్యంగా రీషూట్లపై వస్తున్న వార్తలకు బదులిస్తూ.. "సినిమాలో ఒక్క సీన్ కూడా ఇప్పటివరకు రీషూట్ చేయలేదు. భవిష్యత్తులో కూడా అటువంటి ప్లాన్ లేదు. అత్యంత భారీ స్థాయిలో, పక్కా ప్రణాళికతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కేవలం అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇకపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తాం" అని హెచ్చరించారు.
ఆగస్టు 21న గ్రాండ్ రిలీజ్
నాని కెరీర్‌లోనే విభిన్నమైన లుక్‌తో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని జడలు వేసుకుని, ముక్కు పుడకతో ఒక మాస్ అవతారంలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలోని 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్లమ్ ఏరియాలో నాని వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్
{{/usCountry}}ఇప్పటికే ఈ సినిమాలోని 'ఆయా షేర్' (Aaya Sher) సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్లమ్ ఏరియాలో నాని వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్
{{/usCountry}}దసరా మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నానితో పాటు రాఘవ్ జుయల్, సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది.
నాని గతంలో 'సరిపోదా శనివారం' (2024), 'హిట్: ది థర్డ్ కేస్' (2025) చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఈ క్రమంలో 'ది ప్యారడైజ్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'ది ప్యారడైజ్' సినిమా రీషూట్లు జరుగుతున్నాయా?
లేదు. చిత్ర బృందం ఈ వార్తలను ఖండిస్తూ, ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా రీషూట్ చేయలేదని స్పష్టం చేసింది.
2. ది ప్యారడైజ్ సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
'ది ప్యారడైజ్' చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
3. ది ప్యారడైజ్ సినిమాలో నాని రోల్ ఎలా ఉండబోతోంది?
సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో నాని ఒక మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్, ముఖ్యంగా జడలు, ముక్కు పుడక ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.