...
...
Next Story

Paradise Climax: ఆపుకోలేక పెడుతున్నా.. పారడైజ్ క్లైమ్యాక్స్ దుమ్ములేపుతుంది.. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చా: కాసర్ల శ్యామ్

Paradise Climax: నాని నటిస్తున్న పారడైజ్ మూవీ క్లైమ్యాక్స్ పై లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆపుకోలేక పెడుతున్నా అంటూ అతడు ఈ మూవీ షూటింగ్ నుంచి వచ్చిన విషయాన్ని తెలిపాడు.

Published on: Jul 8, 2026, 15:10:19 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Paradise Climax: నేచురల్ స్టార్ నాని, సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ది పారడైజ్' (The Paradise) క్లైమాక్స్ షూటింగ్ గురించి బయటికొచ్చిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దసరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Paradise Climax: ఆపుకోలేక పెడుతున్నా.. పారడైజ్ క్లైమ్యాక్స్ దుమ్ములేపుతుంది.. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చా: కాసర్ల శ్యామ్
Paradise Climax: ఆపుకోలేక పెడుతున్నా.. పారడైజ్ క్లైమ్యాక్స్ దుమ్ములేపుతుంది.. ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చా: కాసర్ల శ్యామ్

నిజానికి ఈ మూవీ మార్చి 2026 లో రిలీజ్ కావాల్సింది. ఆ తర్వాత ఆగస్టుకు షిఫ్ట్ అయి ఇప్పుడు ఫైనల్ గా సెప్టెంబర్ 2026 కి లాక్ అవ్వబోతోందని ఇండస్ట్రీ టాక్. రిలీజ్ లేట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కొంచెం డల్ అయ్యారు. సరిగ్గా ఈ టైమ్ లో పాపులర్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ పెట్టిన ఒక పోస్ట్ నాని ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.

ఆపుకోలేక పెడుతున్నా

పారడైజ్ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్స్ షూటింగ్ చూసి తనకే మతిపోయిందని శ్యామ్ ఓపెన్ గా చెప్పేశాడు. తన ట్వీట్ ను సేవ్ చేసి పెట్టుకోమని, ది పారడైజ్ క్లైమాక్స్ ఆడియన్స్ కు ఒక నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని శ్యామ్ ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఒక పాన్ ఇండియా అప్పీల్ కోసం శ్రీకాంత్ ఓదెల ఈ ఎపిసోడ్ ను చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాని మార్క్ యాక్టింగ్, దానికి తోడు భారీ యాక్షన్ బ్లాక్స్ ఈ ఎండింగ్ లో ఉండబోతున్నాయట.

“క్లైమాక్స్ పారడైజ్.. నా ట్వీట్ రాసి పెట్టుకోండి.. ఇప్పుడే షూటింగ్ నుంచి వస్తున్నా.. ఆపుకోలేక పెడుతున్నా..” అంటూ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను ట్యాగ్ చేశాడు.

అనిరుధ్ మ్యూాజిక్

ది పారడైజ్ కాస్టింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ఒక పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ లో నటిస్తున్నాడని టాక్ నడుస్తోంది. కయదు లోహార్ హీరోయిన్ గా చేస్తుండగా.. సోనాలి కులకర్ణి, బాబు మోహన్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ యాక్టర్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా ఒక సర్‌ప్రైజ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఎస్ఎల్వీ సినిమాస్ (SLV Cinemas) బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ది పారడైజ్ విశేషాలు

* నటీనటులు: నాని, కయదు లోహర్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్

* డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల

* మ్యూజిక్ డైరెక్టర్: అనిరుధ్ రవిచందర్

* ప్రొడ్యూసర్: సుధాకర్ చెరుకూరి

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks