...
...
Next Story

Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ రచ్చ.. టాలీవుడ్ రికార్డులు బ్రేక్.. యూట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్.. ఫాస్టెస్ట్ రికార్డ్

Yesha Nagula Song: నాని ది పారడైజ్ నుంచి వచ్చిన ఏష నాగుల సాంగ్ యూట్యూబ్ ను ఓ ఊపు ఊపేస్తోంది. టాలీవుడ్ లో అత్యంత వేగంగా 5 కోట్ల వ్యూస్ అందుకున్న పాటగా రికార్డులను చెరిపేయడం విశేషం.

Published on: Sep 3, 2026, 19:56:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Yesha Nagula Song: నేచురల్ స్టార్ నాని (Nani), మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'ద ప్యారడైజ్' (The Paradise). ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'ఏషనాగుల' ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై పూనకాలు తెప్పిస్తోంది. కేవలం 5 రోజుల కంటే తక్కువ టైమ్‌లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి, అతి తక్కువ టైమ్‌లో ఈ మైలురాయిని అందుకున్న ఫాస్టెస్ట్ తెలుగు సాంగ్‌గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

గ్లోబల్ చార్ట్స్‌లో నంబర్ 1 ట్రెండింగ్

Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ రచ్చ.. టాలీవుడ్ రికార్డులు బ్రేక్.. యూట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్.. ఫాస్టెస్ట్ రికార్డ్
Yeshanagula Song: ఏషనాగుల సాంగ్ రచ్చ.. టాలీవుడ్ రికార్డులు బ్రేక్.. యూట్యూబ్‌లో 5 కోట్ల వ్యూస్.. ఫాస్టెస్ట్ రికార్డ్

'ఏషనాగుల' సాంగ్ మానియా కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ స్థాయిలో రచ్చ రచ్చ చేస్తూ యూట్యూబ్ వరల్డ్‌వైడ్ చార్ట్స్‌లో టాప్ 1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ జానపద బాణీలతో అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

జంగి రెడ్డి, సింగర్ ప్రభ కలసి పాడిన ఈ పాట మాస్ ప్రియులకు ఫుల్ దండోరా ఫీల్ అందిస్తోంది. కొరియోగ్రాఫర్ సందీప్ నేతృత్వంలో నాని, కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్పులు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ పాట 50 మిలియన్ల వ్యూస్ అందుకున్న విషయాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ తన ఎక్స్ అకౌంట్లో అధికారికంగా వెల్లడించింది. అంతేకాదు అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న తెలుగు సాంగ్ అని కూడా తెలిపింది.

'దసరా' హ్యాట్రిక్ కాంబో.. అంచనాలు నెక్స్ట్ లెవెల్

గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన 'దసరా' సినిమా తర్వాత నాని, కీర్తి సురేష్, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో 'ద ప్యారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి మేకర్స్ అనౌన్స్ చేశారు. మొదటి పాటతోనే సినిమాపై అంచనాలను పెంచేసిన టీమ్, ఇప్పుడు 'ఏషనాగుల' పాటతో బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని నిరూపించింది. పాన్ ఇండియా లెవెల్లో నాని క్రేజ్ ఈ సినిమాతో మరో ఎత్తుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks