సంక్రాంతి బ్లాక్‌బస్టర్.. ఓటీటీలోకి వచ్చీ రాగానే ఇండియాలోనే టాప్ 1 ట్రెండింగ్ మూవీగా రికార్డు
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మూవీ నారీ నారీ నడుమ మురారి ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది. ప్రైమ్ వీడియోలోకి వచ్చీ రాగానే ఇండియాలోనే నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా నిలవడం విశేషం. రెండో రోజే ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి సైలెంట్ గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. శర్వానంద్ కు చాలా కాలం తర్వాత దక్కిన హిట్ ఇది. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడమే కాదు.. 20 రోజుల్లోనే ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టి అక్కడా దూసుకుపోతోంది.

నారీ నారీ నడుమ మురారి నంబర్ 1
సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో రిలీజైంది నారీ నారీ నడుమ మురారి. అయితే బాక్సాఫీస్ హిట్ గా నిలిచినా మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. బుధవారం అంటే ఫిబ్రవరి 4 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
రెండో రోజే ప్రైమ్ వీడియో ఇండియాలో నంబర్ 1 ట్రెండింగ్ మూవీగా రికార్డు క్రియేట్ చేయడం విశేషం. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను ఓటీటీలో ఎగబడి చూస్తున్నారు. ఇందులోని కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసే సినిమా కావడం కూడా దీనికి కలిసి వస్తోంది.
నారీ నారీ నడుమ మురారి మూవీ విశేషాలు
ఎప్పుడో 35 ఏళ్ల కిందట బాలకృష్ణ లీడ్ రోల్లో ఇదే టైటిల్ తో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో అది పెద్ద హిట్. ఇప్పుడు శర్వానంద్ లీడ్ రోల్లో సాక్సి వైద్య, సంయుక్తి మీనన్ నటించిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది.
రాబ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ మూవీలోని కామెడీకి ప్రేక్షకులు పడీపడీ నవ్వుతున్నారు. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య నిలిచినా.. ఊహకందని విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ఈ సినిమాలో గౌతమ్ అనే పాత్రలో శర్వా నటించాడు. ప్రేమకు హద్దులు లేవని భావించే అతని పాత్ర తన తండ్రి ప్రేమను అర్థం చేసుకొని అతనికి రెండో పెళ్లి చేస్తాడు. ఆ తండ్రి పాత్రలో నరేష్ నటించాడు. కానీ తన జీవితంలో మాత్రం ఇద్దరు అమ్మాయిలు ఎందుకు ఉన్నారు? మొదటి భార్యతో విడాకులు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఓ విడాకుల లాయర్ కూతురిని ప్రేమించి అతడు ఎలాంటి చిక్కుల్లో పడ్డాడన్నదే ఈ నారీ నారీ నడుమ మురారి కథ. థియేటర్లలో చూడకపోతే ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసేయండి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


