...
...
Next Story

ఓటీటీలోకి 20 రోజుల్లోనే వస్తున్న మరో సంక్రాంతి మూవీ.. శర్వానంద్ బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సంక్రాంతి మూవీ కేవలం 20 రోజుల్లోనే రానుంది. శర్వానంద్ నటించిన కామెడీ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూడండి.

Published on: Jan 30, 2026, 14:54:16 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ సంక్రాంతికి వచ్చి సర్‌ప్రైజ్ హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. జనవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా 20 రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవడం విశేషం. ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (జనవరి 30) అనౌన్స్ చేసింది.

నారీ నారీ నడుమ మురారి ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి 20 రోజుల్లోనే వస్తున్న మరో సంక్రాంతి మూవీ.. శర్వానంద్ బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్
ఓటీటీలోకి 20 రోజుల్లోనే వస్తున్న మరో సంక్రాంతి మూవీ.. శర్వానంద్ బ్లాక్‌బస్టర్ కామెడీ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య లీడ్ రోల్స్ లో నటించిన నారీ నారీ నడుమ మురారి సినిమా ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలోకి రానుండటం విశేషం. “ప్రేమ, అబద్ధాలు, చాలా అయోమయంతో కూడిన యూనియన్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నారీ నారీ నడుమ మురారి ఫిబ్రవరి 4 నుంచి” అనే క్యాప్షన్ తో ప్రైమ్ వీడియో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ట్వీట్ చేసింది.

నారీ నారీ నడుమ మురారి బాక్సాఫీస్

నారీ నారీ నడుమ మురారి సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచింది. ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒకరాజులాంటి సినిమాలు బరిలో ఉన్నా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చింది.

కానీ మూవీ మొత్తం కామెడీతో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ విజేతగా నిలిచింది. ఈ లోబడ్జెట్ సినిమా రూ.21 కోట్లు వసూలు చేసింది. అయితే థియేటర్లలో మంచి హిట్ గా నిలిచినా.. ఈ సినిమాను 20 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో మొదటగా ఓటీటీలోకి వస్తున్నది ఈ మూవీయే కావడం విశేషం.

నారీ నారీ నడుమ మురారి మూవీ స్టోరీ, విశేషాలు

సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో నిత్య, గౌతమ్ లవ్ ట్రాక్, ఇంట్లోవాళ్లను ఒప్పించడం, ప్రేయసి తండ్రిని ఒప్పించేందుకు హీరో పడే కష్టాలతో చాలా సరదాగా హాయిగా నవ్విస్తూ సాగుతుంది సినిమా. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.

ఆ తర్వాత సెకండాఫ్ అంతా కూడా డిఫరెంట్ సీన్లతో అలిరిస్తూనే ఉంటుంది. స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. కానీ చివరికి ఎలా ముగించారు, ఎలా నరేట్ చేశారనేదే ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే విషయం. అందులో డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఫుల్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. చాలా రోజులుగా హిట్ కోసం చూస్తున్న శర్వానంద్ కు మంచి విజయాన్ని అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి ఇక మీ ఇంట్లో కూర్చొనే ప్రైమ్ వీడియోలో చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks