National Awards: ఢిల్లీకి గుడ్‌బై.. 71 ఏళ్ల పరంపరకు ఫుల్‌స్టాప్.. ఈసారి గుజరాత్‌లో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
National Awards: నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదాన వేడుక జరిగే వేదిక మారింది. 71 ఏళ్ల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది ఈ వేడుక గుజరాత్ లోని స్టాచూ ఆఫ్ యూనిటీ దగ్గర జరగనుండటం విశేషం. దీని వెనుక కారణమేంటో చూడండి.
National Awards: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (72nd National Film Awards) ప్రెజెంటేషన్ వేడుకపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 71 ఏళ్లుగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి గుజరాత్‌కు మార్చారు. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్ వద్ద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం 'స్టాచూ ఆఫ్ యూనిటీ' (Statue of Unity) ఆవరణలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది.

'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' కాన్సెప్ట్‌తో సరికొత్త నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' (Ek Bharat, Shreshtha Bharat) స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌ను కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా, దేశంలోని విభిన్న ప్రాంతాలకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఇకపై ప్రతీ సంవత్సరం దేశంలోని ఒక విభిన్నమైన లొకేషన్‌లో ఈ పురస్కార వేడుకను నిర్వహించనున్నారు.
ఈ నిర్ణయంతో గుజరాత్ చరిత్రలోనే మొదటిసారిగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఏక్తా నగర్ వేదికగా జరిగే ఈ ఈవెంట్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై 92 మంది విజేతలకు స్వయంగా అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన దాదాపు 1000 మంది విఐపి అతిథులు హాజరుకానున్నారు.
ప్రత్యేక అల్యూమినియం డోమ్ సిద్ధం.. 75 నిమిషాల వేడుక
స్టాచూ ఆఫ్ యూనిటీ బస్ బే ప్రాంతంలో ఈ ఈవెంట్ కోసం ఒక భారీ అల్యూమినియం స్ట్రక్చరల్ డోమ్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. కేవలం 75 నిమిషాల పాటు సాగే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో 2024 సంవత్సరానికి గాను ఎంపికైన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను సత్కరిస్తారు. గతంలో విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించినట్లే అన్ని ప్రోటోకాల్స్ పాటిస్తూ, సరికొత్త సాంస్కృతిక వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు.
సినిమా రంగాన్ని కేవలం ఒకే ప్రాంతంలో కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలలా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వివిధ భాషల ఆర్టిస్టులను ఒకే చోట కలిపేలా ఈ ఈవెంట్ డిజైన్ చేశారు.
'ఆర్టికల్ 370', మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌లకు అవార్డులు
ఈ ఏడాది జులైలో కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రకటించిన విన్నర్స్ లిస్ట్ ప్రకారం, 'ఆర్టికల్ 370' (Article 370) సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచినందుకు గాను బాలీవుడ్ నటి యామీ గౌతమ్ (Yami Gautam) ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుకోనున్నారు.
ఇక ఉత్తమ నటుడి కేటగిరీలో తీవ్ర పోటీ నెలకొనగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty), బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును పంచుకోనున్నారు. వీరితో పాటు భారతీయ సినిమా పరిశ్రమలోని పలువురు ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందనున్నాయి. ఈ మార్పు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


