సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలుగా పేరుగాంచిన నయనతార (Nayanthara), త్రిష (Trisha) తమ అభిమానులకు సోమవారం (జనవరి 19) ఒక బ్యూటిఫుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. వీరిద్దరూ కలిసి సముద్రం మధ్యలో క్రూజ్ షిప్‌పై ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెనుక సూర్యాస్తమయం, చల్లని సముద్రపు గాలి మధ్య.. నలుపు రంగు దుస్తులు, కూలింగ్ గ్లాసెస్ ధరించి వీరిద్దరూ నవ్వుతూ దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
‘త్రిష లేకపోతే నయనతార’ రియల్ అయ్యింది

ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇద్దరు టాప్ హీరోయిన్లు అయిన నయనతార, త్రిష ఇలా కలిసి కనిపించడం చాలా అరుదు కావడంతో.. కొందరు ఇది నిజమా లేక ఏఐ (AI) క్రియేషనా అని అనుమానం వ్యక్తం చేశారు. "నయన్ అకౌంట్ చూశాకే ఇది నిజమని తెలిసింది" అని ఒకరు.. "ఫైనల్లీ.. త్రిష లేకపోతే నయనతార నిజమైంది" అని మరొకరు కామెంట్ చేశారు. 2015లో వచ్చిన జీవీ ప్రకాష్ కుమార్ సినిమా ‘త్రిష ఇల్లన నయనతార’ టైటిల్‌ను ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
కెరీర్ పరంగా బిజీ బిజీ..
నయనతార ఈమధ్యే చిరంజీవితో కలిసి నటించిన మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ తొలి వారంలోనే రూ.292 గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇదే కాకుండా నయన్.. ఇటీవలే మాధవన్, సిద్ధార్థ్‌లతో కలిసి నటించిన తమిళ స్పోర్ట్స్ థ్రిల్లర్ ‘టెస్ట్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘డియర్ స్టూడెంట్స్’, ‘మూకుతి అమ్మన్ 2’ (అమ్మోరు తల్లి 2), యష్‌తో ‘టాక్సిక్’ (Toxic) వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇక త్రిష విషయానికి వస్తే ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించింది. అంతకుముందు అజిత్ ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ‘బృంద’లో నటించింది. త్వరలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోనూ త్రిష కీలక పాత్రలో కనిపించనుంది.
{{/usCountry}}ఇక త్రిష విషయానికి వస్తే ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమాలో కనిపించింది. అంతకుముందు అజిత్ ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో పాటు తెలుగు వెబ్ సిరీస్ ‘బృంద’లో నటించింది. త్వరలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలోనూ త్రిష కీలక పాత్రలో కనిపించనుంది.
{{/usCountry}}