న‌య‌న‌తార బ‌ర్త్‌డే స్పెష‌ల్‌-మ‌హారాణిగా లేడీ సూప‌ర్ స్టార్‌-బాల‌య్య బాబుతో నాలుగో సినిమా-వీడియో వైర‌ల్‌

లేడీ సూపర్ స్టార్ నయనతార బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ అప్ డేట్ వచ్చింది. నందమూరి బాలకృష్ణతో నయనతార నాలుగోసారి జత కట్టనుంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్. 

Published on: Nov 18, 2025, 12:18:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బాలకృష్ణ-నయనతార.. ఈ పెయిర్ ది హిట్ కాంబినేషన్. వీళ్లు ఇప్పటికే మూడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు నాలుగో సినిమా రెడీ కానుంది. బాలకృష్ణ, నయనతార హీరోహీరోయిన్లుగా గోపీచంద్ మలినేని ఓ మూవీ తెరకెక్కించనున్నారు. ఎన్బీకే111 వర్కింగ్ టైటిల్ తో రెడీ కాబోతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ అని మేకర్స్ ప్రకటించారు. ఆమె బర్త్ డే సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు.

పోస్టర్ లో నయనతార (x)
పోస్టర్ లో నయనతార (x)

మహారాణిగా నయనతార

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో మహారాణిగా నయనతార నటించనుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఇవాళ (నవంబర్ 18) నయనతార బర్త్ డే సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు. మహారాణి గెటప్ లో వెనక్కి ధైర్యంగా చూస్తూ కనిపించింది నయనతార. గాడ్ ఆఫ్ మాసెస్, క్వీన్ మరోసారి కలిశారని వీడియోలో పేర్కొన్నారు.

సముద్రాల ప్రశాంతత

‘‘సముద్రాల ప్రశాంతతను, తుపానుల బీభత్సాన్ని మోసే రాణిగా ఎన్బీకే111 రాజ్యంలోకి నయనతార అడుగుపెడుతోంది. మా టీమ్ నుంచి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక రోర్ లోడ్ అవుతుంది. త్వరలోనే భారీ అప్ డేట్లు వస్తాయి’’ అని వృద్ధి సినిమాస్ ఎక్స్ లో పోస్టు చేసింది. దర్శకుడు గోపీచంద్ కూడా నయనతారకు వెల్ కమ్ చెప్పాడు.

నాలుగో సినిమా

బాలకృష్ణ-నయనతార పెయిర్ అంటే ఫ్యాన్స్ కు క్రేజీ ఫీలింగ్ ఉంటుంది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘జై సింహా’ హిట్లుగా నిలిచాయి. బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం మరోసారి కలిసింది ఈ జంట. మరోవైపు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ సినిమా తీశారు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్ పైనా మంచి అంచనాలున్నాయి.

అఖండ 2

అఖండ అంటూ మరోసారి థియేటర్లను షేక్ చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2 మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లోల రిలీజ్ కానుంది. దీని తర్వాత గోపీచంద్ మలినేని సినిమా కోసం బాలయ్య రంగంలోకి దిగే అవకాశముంది. మరోవైపు అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది నయనతార.

గోపీచంద్-బాలకృష్ణ మూవీ పూజ కార్యక్రమాలను నవంబర్ 26న నిర్వహిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More