దక్షిణాది చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన నయనతార.. రియల్ ఎస్టేట్ రంగంలో తన పెట్టుబడులను కొనసాగిస్తోంది. తాజాగా చెన్నైలోని విలాసవంతమైన పోయెస్ గార్డెన్ (Poes Garden) ఏరియాలో నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఒక లగ్జరీ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ డీల్ విలువ ₹31.5 కోట్లుగా ఉంది.
నయనతార ఆస్తి వివరాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్న ఏరియాలోనే నయనతార ఈ ఇల్లు కొనడం విశేషం. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. తేనాంపేటలోని 'లెగసీ' (Legacy) ప్రాజెక్ట్‌లో నాలుగు, ఐదవ అంతస్తుల్లో ఈ డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ ఉంది. దీని విస్తీర్ణం 14,369 చదరపు అడుగుల సూపర్ బిల్ట్-అప్ ఏరియా కావడం విశేషం. దీని ధర చదరపు అడుగుకు సుమారు ₹21,946. ఈ ఆస్తిలో నయనతారకు 90% వాటా ఉండగా, విఘ్నేష్ శివన్‌కు 10% వాటా ఉంది. ఎనిమిది రిజర్వ్డ్ కార్ పార్కింగ్ స్లాట్లు ఈ అపార్ట్‌మెంట్‌తో పాటు కేటాయించారు.
మిగిలిన సెలబ్రిటీల పక్కనే..
పోయెస్ గార్డెన్ అంటేనే వీవీఐపీల అడ్రస్. ఇక్కడే సూపర్ స్టార్ రజనీకాంత్, దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత నివాసాలు ఉన్నాయి. ఇటీవల నటుడు ధనుష్ కూడా ఇదే ప్రాంతంలో ₹150 కోట్ల విలువైన బంగ్లాను నిర్మించుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు నయనతార కూడా అదే ప్రాంతంలో స్థిరపడటం విశేషం.
నయనతార ఇతర ఆస్తులు
నయనతారకు కేరళలోని తన పూర్వీకుల ఇల్లు కాకుండా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సుమారు ₹15 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు ఉన్నట్లు సమాచారం. చెన్నై, కేరళలో కూడా ఆమెకు పలు రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.
నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, 2025లో చెన్నై నివాస గృహాల ధరలు 7% పెరిగాయి. ముఖ్యంగా ఐటీ రంగం, మెట్రో కనెక్టివిటీ పెరగడం వల్ల పోయెస్ గార్డెన్ వంటి ప్రీమియం ఏరియాల్లో డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది.
{{/usCountry}}నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, 2025లో చెన్నై నివాస గృహాల ధరలు 7% పెరిగాయి. ముఖ్యంగా ఐటీ రంగం, మెట్రో కనెక్టివిటీ పెరగడం వల్ల పోయెస్ గార్డెన్ వంటి ప్రీమియం ఏరియాల్లో డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది.
{{/usCountry}}