OTT Releases: ఒకే రోజు ఒకే ఓటీటీలోకి నయనతార రెండు క్రేజీ సినిమాలు-ఒకటేమో బోల్డ్ యాక్షన్ డ్రామా-మరొకటి రొమాంటిక్ కామెడీ!
Nayanthara OTT Releases: లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన రెండు బిగ్ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఆసక్తికర ప్రచారం సాగుతోంది. బోల్డ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’తో పాటు, ఆమె స్వయంగా నిర్మించి నటించిన రోమాంటిక్ కామెడీ ‘హాయ్’ సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయని టాక్.
Nayanthara OTT Releases: గత నెలలో లేడీ సూపర్‌స్టార్ నయనతార నుంచి బ్యాక్-టు-బ్యాక్ రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. కేజీఎఫ్ ఫేమ్ యశ్ సరసన నటించిన హై-వోల్టేజ్ బోల్డ్ యాక్షన్ మూవీ 'టాక్సిక్' (Toxic)తో పాటు, విష్ణు ఎడవన్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్యూట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'హాయ్' (Hi) బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

ఓటీటీలోకి నయనతార సినిమాలు
అయితే, భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ టాక్సిక్, హాయ్ రెండు చిత్రాలు థియేటర్లలో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. దీంతో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ రెండు ప్రాజెక్టుల ఆశలన్నీ నెలకొన్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఒకే ఓటీటీలోకి రాబోతున్నాయని తెలిసింది.
జీ5 ఓటీటీలో
నయనతార స్వయంగా నిర్మించిన 'హాయ్' సినిమా ఇప్పటికే జీ5 (ZEE5) సెప్టెంబర్ రిలీజ్ క్యాలెండర్‌లో చోటు దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 25, 2026 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురావడానికి ప్లాట్‌ఫామ్ ప్లాన్ చేస్తోంది. దీనిపై జీ5 యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, డేట్ విషయంలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
'టాక్సిక్' కూడా అదే రోజు?
మరోవైపు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యశ్ 'టాక్సిక్' కూడా సెప్టెంబర్ 25నే జీ5 లో విడుదల కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ బోల్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలో నయనతార 'గంగా' అనే కీలక పాత్రలో హీరో సోదరిగా కనిపించింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు జీ5 లో ల్యాండ్ అయితే ఈ వీకెండ్ ఓటీటీ చార్ట్స్‌లో నయనతార హవా నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
థియేట్రికల్ ఫ్లాప్స్
స్టార్ హీరోలు, బ్రైట్ కాస్టింగ్ ఉన్నప్పటికీ థియేటర్లలో కొన్ని సినిమాలు కంటెంట్, విడుదల టైమింగ్ వల్ల ఆశించిన వసూళ్లను రాబట్టలేవు. యశ్ ‘టాక్సిక్’, నయనతార 'హాయ్' సినిమాల విషయంలోనూ ఇదే జరిగింది. అయితే, డిజిటల్ స్పేస్‌లో ఆడియన్స్ మైండ్‌సెట్ పూర్తిగా వేరుగా ఉంటుంది.
ఒకే రోజు ఒకే స్టార్‌కి చెందిన రెండు విభిన్న జానర్ల (బోల్డ్ మాస్ యాక్షన్ vs రొమాంటిక్ కామెడీ) సినిమాలు ఒకే ఓటీటీలో స్ట్రీమ్ కావడం అరుదైన విషయం. యశ్ పాన్-ఇండియా ఇమేజ్, నయనతార స్టార్‌డమ్ కారణంగా జీ5 లో ఈ రెండు సినిమాలకు మంచి వ్యూయర్‌షిప్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా హోమ్ ఆడియన్స్ ఓటీటీలో ఎలాంటి ప్రెజర్ లేకుండా థియేట్రికల్ ఫ్లాప్ సినిమాలను మళ్లీ రీ-విజిట్ చేసే ట్రెండ్ ఇటీవల బాగా పెరిగింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


