...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్.. ఏకంగా రూ.7.3 లక్షల కోట్లతో వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకున్న సంస్థ

నెట్‌ఫ్లిక్స్ ఓ భారీ డీల్ కుదుర్చుకుంది. వార్నర్ బ్రదర్స్ ని ఏకంగా 82.7 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7.37 లక్షల కోట్లకు దక్కించుకోవడం విశేషం. ఈ డీల్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Published on: Dec 5, 2025, 20:42:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఎంటర్టైన్మెంట్ వరల్డ్‌లోనే అతిపెద్ద సంచలనం నమోదైంది. స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. హాలీవుడ్ ప్రముఖ స్టూడియో వార్నర్ బ్రదర్స్‌ను (Warner Bros.) కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో వార్నర్ బ్రదర్స్ ఫిల్మ్, టెలివిజన్ స్టూడియోలతో పాటు హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ చేతికి వెళ్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది.

నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్.. ఏకంగా రూ.7.3 లక్షల కోట్లతో వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకున్న సంస్థ (AFP)
నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే డీల్.. ఏకంగా రూ.7.3 లక్షల కోట్లతో వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకున్న సంస్థ (AFP)

టుడుమ్ (Tudum) రిపోర్టు ప్రకారం ఈ డీల్ విలువ మొత్తం 82.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 7.3 లక్షల కోట్లు). ఇది నగదు, స్టాక్ లావాదేవీల రూపంలో జరుగుతుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (WBD) ఒక్కో షేరు విలువను 27.75 డాలర్లుగా నిర్ణయించారు.

హ్యారీ పాటర్, స్ట్రేంజర్ థింగ్స్ ఒకే గూటికి..

ఈ భారీ కొనుగోలుపై నెట్‌ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ సరండోస్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ప్రపంచాన్ని అలరించడమే మా లక్ష్యం. వార్నర్ బ్రదర్స్ దగ్గర ఉన్న అద్భుతమైన లైబ్రరీ (కాసాబ్లాంకా, సిటిజన్ కేన్ వంటి క్లాసిక్స్ నుంచి.. హ్యారీ పాటర్, ఫ్రెండ్స్ వంటి మోడ్రన్ హిట్స్ వరకు) మా దగ్గర ఉన్న కల్చర్-డిఫైనింగ్ టైటిల్స్ (స్ట్రేంజర్ థింగ్స్, స్క్విడ్ గేమ్)తో కలవడం వల్ల మేము మా లక్ష్యాన్ని మరింత మెరుగ్గా చేరుకోగలము. మేము ప్రేక్షకులకు వారు కోరుకునే వినోదాన్ని మరింత ఎక్కువగా అందించగలం" అని టెడ్ పేర్కొన్నారు.

వందేళ్ల చరిత్ర.. కొత్త మలుపు

వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రెసిడెంట్, సీఈఓ డేవిడ్ జాస్లావ్ ఈ డీల్‌పై స్పందిస్తూ.. "ప్రపంచంలోనే రెండు గొప్ప కథలు చెప్పే సంస్థలు ఈ రోజు ఒక్కటయ్యాయి. వందేళ్లకు పైగా వార్నర్ బ్రదర్స్ ప్రేక్షకులను అలరించింది. నెట్‌ఫ్లిక్స్‌తో కలవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రాబోయే తరాలకు కూడా మా కథలను ఆస్వాదిస్తూనే ఉంటారని మేము విశ్వసిస్తున్నాం" అని తెలిపారు.

డీల్ ముఖ్యాంశాలు

నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఇద్దరూ ఈ లావాదేవీని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కలయికతో స్ట్రీమింగ్ రంగంలో నెట్‌ఫ్లిక్స్ గుత్తాధిపత్యం మరింత పెరిగే అవకాశం ఉంది. హ్యారీ పాటర్, బ్యాట్‌మ్యాన్ వంటి ఐకానిక్ పాత్రలు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌తో కలిస్తే వచ్చే వినోదం ఎలా ఉంటుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe