Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో 20 వారాలుగా టాప్ 10లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గోల్డ్ స్మగ్లింగ్ ఇలా..

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్ లో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్ ఏకంగా 20 వారాలుగా టాప్ 10లో ఉంటూ వస్తోంది. దేశంలోకి అక్రమంగా బంగారాన్ని ఎన్ని మార్గాల్లో తీసుకొస్తారు.. వాటిని కస్టమ్స్ అధికారులు ఎలా అడ్డుకుంటారో ఈ సిరీస్ లో చూడొచ్చు.

Published on: Jun 24, 2026, 17:10:20 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix Web Series: బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' (Taskari: The Smugglers Web) ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు పీక్ లెవెల్ థ్రిల్ ఇస్తూ ఏకంగా 20 వారాలుగా ఇండియా టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది.

Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో 20 వారాలుగా టాప్ 10లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గోల్డ్ స్మగ్లింగ్ ఇలా..
Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో 20 వారాలుగా టాప్ 10లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గోల్డ్ స్మగ్లింగ్ ఇలా..

ఒక హిందీ వెబ్ సిరీస్ ఈ రేంజ్‌లో దాదాపు ఐదు నెలల పాటు టాప్ చార్ట్స్‌లో ట్రెండ్ అవ్వడం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హిస్టరీలోనే ఒక అరుదైన మైల్‌స్టోన్ అని చెప్పాలి. ప్రస్తుతం 7.1 ఐఎండీబీ (IMDb) రేటింగ్‌తో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మాస్టర్ మైండ్ నీరజ్ పాండే మార్క్ స్మగ్లింగ్ డ్రామా

ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను ఇండియన్ స్క్రీన్ పై రియలిస్టిక్ క్రైమ్ డ్రామాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన స్టార్ డైరెక్టర్ నీరజ్ పాండే రూపొందించారు. 'ఎ వెడ్నెస్ డే', 'స్పెషల్ ఓపీఎస్', 'ఎమ్‌ఎస్ ధోని' లాంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్స్‌తో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నీరజ్ పాండే.. ఈ తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్ అనే వెబ్ సిరీస్‌ను మొత్తం 7 ఎపిసోడ్స్‌గా ఎంతో గ్రిప్పింగ్‌గా మలిచారు. ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్మగ్లింగ్ నెట్‌వర్క్, కస్టమ్స్ అధికారుల మైండ్ గేమ్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది.

"ఎయిర్‌పోర్ట్‌లలో నిషేధిత వస్తువులను, బంగారాన్ని కేటుగాళ్లు ఎలా రకరకాల పద్ధతుల్లో స్మగ్లింగ్ చేస్తారో కళ్లకు కట్టినట్లు చూపించడంలో నీరజ్ పాండే సక్సెస్ అయ్యారు. ప్రతి ఎపిసోడ్ ఎండ్ కార్డ్‌లో వచ్చే ట్విస్ట్‌లు నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పీక్స్‌కు తీసుకెళ్తాయి" అని నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు.

కస్టమ్ ఆఫీసర్‌గా ఇమ్రాన్ హష్మీ వన్ మ్యాన్ షో..

ఈ వెబ్ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్ అర్జున్ మీనా క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ వేదికగా దేశంలోకి జరిగే అక్రమ రవాణాను అడ్డుకోవడం, స్మగ్లింగ్ వెనుక ఉన్న గ్యాంగ్‌స్టర్ బడా చౌదరి (శరద్ కేల్కర్) సిండికేట్‌ను పూర్తిగా అంతమొందించడమే అర్జున్ మీనా అసలు మిషన్. అర్జున్ తన టీమ్‌తో కలిసి ఈ స్మగ్లింగ్ మాఫియా నెట్‌వర్క్‌ను ఎలా ఛేదించాడనేదే 'తస్కరి' అసలు కథ.

ఈ వెబ్ సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బడా చౌదరి పాత్రలో శరద్ కేల్కర్ యాక్టింగ్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే మైండ్ గేమ్ సీన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఈ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. అనురాగ్ సిన్హా, జమీల్ ఖాన్, ఫ్రేడీ దారూవాలా, జోయా అఫ్రోజ్, నందీష్ సింగ్ సంధు, అమృతా ఖాన్విల్కర్ తమ రోల్స్‌లో బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు.

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 ట్రెండింగ్ చార్ట్స్ ఇవే

ఈ వారం కూడా 'తస్కరీ' సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో 8వ స్థానంలో ట్రెండ్ అవుతూ తన హవా కొనసాగిస్తోంది. ఈ వారపు కంప్లీట్ టాప్ 10 లిస్ట్ ఒకసారి చూస్తే.. ఫస్ట్ ప్లేస్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన 'ఇండియాస్ గాట్ లేటెంట్' ఉంది. సెకండ్ ప్లేస్‌లో 'టీచ్ యూ ఎ లెసన్' (3 వారాలు), థర్డ్ ప్లేస్‌లో 'ఐ విల్ ఫైండ్ యు' (ఒక వారం), ఫోర్త్ ప్లేస్‌లో 'ద వండర్‌ఫుల్స్' (6 వారాలు) కొనసాగుతున్నాయి.

ఐదో స్థానంలో రీసెంట్ సెన్సేషన్ 'RAW: 2026' (ఒక వారం) ఉండగా, ఆరో స్థానంలో 'వైరల్ హిట్' (ఒక వారం), ఏడో స్థానంలో 'బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అర్మైన్' (6 వారాలు) ఉన్నాయి. ఎనిమిదో స్థానంలో రికార్డుల 'తస్కరీ' నిలవగా, తొమ్మిదో స్థానంలో 'గ్లోరీ సీజన్ 1' (8 వారాలు), పదో స్థానంలో 'డబ్ల్యూడబ్ల్యూఈ స్మాక్ డౌన్: 2026' (ఒక వారం) ట్రెండ్ అవుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More