Netflix Mega Verse: నెట్‌ఫ్లిక్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ.. అఫీషియల్‌గా మెగా టాక్ షో అనౌన్స్.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ కమెడియన్

Netflix Mega Verse: టాలీవుడ్ రారాజు, మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’లో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యారు. 'మాస్ కి గ్రామర్, స్టైల్ కి డెఫినిషన్' అంటూ చిరంజీవి హోస్ట్‌గా రాబోతున్న సరికొత్త డిజిటల్ టాక్ షో ‘మెగావర్స్’ను నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.

Published on: Oct 29, 2026, 16:24:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Mega Verse: తెలుగు చిత్రసీమలో దశాబ్దాలుగా ఎన్నో సరికొత్త రికార్డులు తిరగరాస్తూ, బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో, కళ్లు చెదిరే డ్యాన్సులతో, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ఓటీటీ ప్రపంచంలో టాక్ షో ద్వారా రానున్నారు.

Netflix Mega Verse: నెట్‌ఫ్లిక్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ.. అఫీషియల్‌గా మెగా టాక్ షో అనౌన్స్.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ కమెడియన్
Netflix Mega Verse: నెట్‌ఫ్లిక్స్‌లోకి చిరంజీవి ఎంట్రీ.. అఫీషియల్‌గా మెగా టాక్ షో అనౌన్స్.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ కమెడియన్

గత కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న వార్తలకు తెరదించుతూ.. ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. చిరంజీవితో నిర్మిస్తున్న భారీ సెలబ్రిటీ టాక్ షోను అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సునీల్, సత్యలతో మొదటి ధమాకా ఎపిసోడ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

'మెగావర్స్'గా నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్

"మాస్ కి గ్రామర్.. స్టైల్ కి డెఫినిషన్! మెగాస్టార్ ఈజ్ హియర్!" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ (Netflix India South) సోషల్ మీడియా వేదికగా ఈ బిగ్గెస్ట్ అప్‌డేట్‌ను పంచుకుంది. ఈ టాక్ షోకి 'మెగావర్స్' (Megaverse) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

వాస్తవానికి చాలా కాలంగా చిరంజీవిని తమ డిజిటల్ వేదికపైకి తీసుకురావడానికి నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలు విడతల చర్చల అనంతరం మెగాస్టార్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భారీ షో కార్యరూపం దాల్చింది.

టాక్ షో రంగానికి మెగా గ్లామర్

తెలుగు బుల్లితెరపై ఇటీవల కాలంలో సీనియర్ స్టార్ హీరోలు హోస్ట్ చేసే టాక్ షోలకు వీక్షకుల నుంచి అపారమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' (Unstoppable)తో సంచలనం సృష్టించగా, జగపతి బాబు కూడా జయమ్ము నిశ్చయమ్మురా అంటూ జీ5 ఓటీటీలోకి దిగారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ఈ షోపై ట్రేడ్ వర్గాల్లో, ఓటీటీ ఆడియెన్స్ లో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.

గతంలో చిరంజీవి బుల్లితెరపై 'మీలో ఎవరు కోటీశ్వరుడు' (4వ సీజన్)కు హోస్ట్‌గా వ్యవహరించి తనదైన శైలి సంభాషణలతో, ఆత్మీయమైన పలకరింపులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మానందంతో తొలి ఎపిసోడ్: షూటింగ్ పిక్స్ వైరల్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లోని ఒక ప్రత్యేక సెట్‌లో ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి తన ఆప్తమిత్రుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam)తో పాటు నటులు సునీల్ (Sunil), కామెడీ సెన్సేషన్ సత్య (Satya) లతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు.

దశాబ్దాలుగా వెండితెరపై మైమరిపించిన చిరంజీవి - బ్రహ్మానందం కాంబినేషన్ ఈ టాక్ షో వేదికపై ఎలాంటి సరదా జ్ఞాపకాలను, వినోదాన్ని పంచబోతున్నారోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాబోయే ఎపిసోడ్‌లలో భారతీయ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ, సినీ దిగ్గజాలు, పాన్-ఇండియా స్టార్స్ ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ డిజిటల్ టాక్ షో 'మెగావర్స్' స్ట్రీమింగ్ డేట్ అలాగే ట్రైలర్‌ను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా రిలీజ్ చేయనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More