...
...
Next Story

బ్రాహ్మణులను అవమానించేలా నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్.. మా ఉద్దేశం అది కాదంటూ హీరో వివరణ.. టీజర్‌ను తొలగించామంటూ..

నెట్‌ఫ్లిక్స్ రాబోయే సినిమా 'ఘూస్‌ఖోర్ పండిత్' (Ghooskhor Pandat) టైటిల్ వివాదం రోజురోజుకూ పెద్దదవుతోంది. బ్రాహ్మణులను కించపరిచేలా ఉందంటూ ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడం, కోర్టు కేసులు పడటంతో ఎట్టకేలకు హీరో మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు నీరజ్ పాండే స్పందించారు.

Published on: Feb 6, 2026, 13:49:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

నెట్‌ఫ్లిక్స్ ఇండియా ప్రకటించిన 2026 సినిమాల జాబితాలో 'ఘూస్‌ఖోర్ పండిత్' (అవినీతి పండితుడు అని అర్థం వచ్చేలా) అనే సినిమా తీవ్ర వివాదానికి దారితీసింది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా టైటిల్, కంటెంట్ బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో మూవీ టీమ్ దిగొచ్చింది.

మనోజ్ బాజ్‌పాయ్ ఆవేదన

బ్రాహ్మణులను అవమానించేలా నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్.. మా ఉద్దేశం అది కాదంటూ హీరో వివరణ.. టీజర్‌ను తొలగించామంటూ..
బ్రాహ్మణులను అవమానించేలా నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్.. మా ఉద్దేశం అది కాదంటూ హీరో వివరణ.. టీజర్‌ను తొలగించామంటూ..

ఈ వివాదంపై ఘూస్‌ఖోర్ పండత్ మూవీ హీరో మనోజ్ బాజ్‌పాయ్ ఎక్స్ వేదికగా తొలిసారి స్పందించాడు. దర్శకుడు నీరజ్ పాండే ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను షేర్ చేస్తూ.. తమ ఉద్దేశం ఎవరినీ బాధపెట్టడం కాదని స్పష్టం చేశాడు.

"ప్రజల భావోద్వేగాలను, ఆందోళనలను నేను గౌరవిస్తాను. మేము చేసిన పని వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిసినప్పుడు.. ఒక్కక్షణం ఆగి, వారి మాట వినడం మా బాధ్యత. ఒక నటుడిగా నేను కథను, పాత్రను మాత్రమే చూస్తాను. ఇది కేవలం తప్పులు చేసే ఒక వ్యక్తి కథే తప్ప, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు" అని మనోజ్ పేర్కొన్నాడు.

అలాగే ప్రజాల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని సినిమా ప్రమోషనల్ మెటీరియల్ ను తాత్కాలికంగా తొలగించాలని నిర్మాతలు నిర్ణయించినట్లు అతడు తెలిపాడు. ఇది తాము ఈ విషయాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నామో తెలియజేస్తుందని అన్నాడు.

"అదొక కల్పిత పాత్ర మాత్రమే": నీరజ్ పాండే

దర్శకుడు నీరజ్ పాండే కూడా శుక్రవారం (ఫిబ్రవరి 6) ఒక ప్రకటన విడుదల చేశాడు. "ఈ కథ పూర్తిగా కల్పితం. ఇందులో 'పండిత్' అనేది కేవలం ఆ పాత్రకు ఉన్న ముద్దుపేరు మాత్రమే తప్ప, ఏ కులానికి లేదా మతానికి సంబంధించింది కాదు. అయినప్పటికీ ఈ టైటిల్ కొందరిని బాధపెట్టిందని మేము గుర్తించాం. అందుకే ప్రమోషనల్ కంటెంట్ ను తొలగిస్తున్నాం. ఒక ఫిలింమేకర్‌గా బాధ్యతాయుతమైన కథలు చెప్పడమే నా లక్ష్యం" అని అతడు వివరణ ఇచ్చాడు.

చట్టపరమైన చిక్కుల్లో సినిమా..

సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ అడ్వకేట్ వినీత్ జిందాల్ ద్వారా ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అటు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కూడా కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు పంపింది. సినిమా టైటిల్ ప్రతికూల మూస ధోరణులను ప్రోత్సహిస్తోందని పేర్కొంది.

ఘూస్‌కోర్ పండత్ అసలు కథేంటి?

మనోజ్ బాజ్‌పాయ్ ఇందులో అజయ్ దీక్షిత్ అలియాస్ 'పండిత్' అనే అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే అతను, ఢిల్లీలో జరిగే ఒక అంతర్జాతీయ కుట్రలో ఎలా చిక్కుకున్నాడు అనేదే ఈ సినిమా కథ. వివాదం ముదురుతుండటంతో టైటిల్ మారుస్తారా లేదా అనేది చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe