బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ రాబోయే నెట్‌ఫ్లిక్స్ సినిమా టైటిల్ వివాదం మొత్తానికి ముగిసింది. 'ఘూస్‌ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే టైటిల్‌తో పాటు దానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ను ఉపసంహరించుకున్నట్లు దర్శకుడు నీరజ్ పాండే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించాడు. దీంతో కోర్టు ఈ కేసుకు ముగింపు పలికింది.
టైటిల్ మార్పుపై దర్శకుడి స్పష్టత..

ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తున్న తాజా నెట్‌ఫ్లిక్స్ మూవీ ఘూస్‌ఖోర్ పండత్. అంటే లంచాలకు మరిగిన పండిత్ అని అర్థం. ఈ టైటిల్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వివాదంపై సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 19) విచారణ జరిపింది. ఈ సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, దీని విడుదలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించి పరిష్కరించింది.
జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం నీరజ్ పాండే సమర్పించిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ కేసును ముగించింది. వివాదాస్పదమైన 'ఘూస్‌ఖోర్ పండిట్' టైటిల్‌ను పూర్తిగా ఉపసంహరించుకున్నామని, భవిష్యత్తులో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని నీరజ్ పాండే కోర్టుకు స్పష్టం చేశాడు.
ఇక కొత్త టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని, అయితే అది పాత టైటిల్‌ను పోలి ఉండదని అతడు హామీ ఇచ్చాడు. కొత్త పేరు పూర్తిగా సినిమా కథాంశానికి అద్దం పట్టేలా ఉంటుందని, మళ్లీ వివాదాలకు తావు ఇవ్వదని అఫిడవిట్‌లో పేర్కొన్నాడు.
సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు..
ఈ కేసు విచారణ సందర్భంగా ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కళాత్మక స్వేచ్ఛ ముసుగులో సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. సృజనాత్మకతకు, సామాజిక బాధ్యతకు మధ్య సమతుల్యత పాటించడం సినిమా పరిశ్రమ బాధ్యత అని ధర్మాసనం నొక్కిచెప్పింది.
{{/usCountry}}ఈ కేసు విచారణ సందర్భంగా ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కళాత్మక స్వేచ్ఛ ముసుగులో సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కోర్టు స్పష్టం చేసింది. సృజనాత్మకతకు, సామాజిక బాధ్యతకు మధ్య సమతుల్యత పాటించడం సినిమా పరిశ్రమ బాధ్యత అని ధర్మాసనం నొక్కిచెప్పింది.
{{/usCountry}}నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామా. ఇందులో మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee) ఒక అవినీతి, కుట్రల వలయంలో చిక్కుకున్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో నుష్రత్ భరూచా, సాకిబ్ సలీమ్, అక్షయ్ ఒబెరాయ్, దివ్యా దత్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.