Netflix Releases: ఓటీటీ ప్రియులకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈసారి సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఈ వారం ఏకంగా 10 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు డిజిటల్ స్క్రీన్‌పైకి దూసుకొస్తున్నాయి. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్ నుంచి ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ల వరకు ప్రతి ఒక్కరి టేస్ట్‌కు తగినట్లుగా కంటెంట్ క్యూ కట్టింది.

మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ పాపులర్ షోలు, క్రైమ్ థ్రిల్లర్లు ఈ వీకెండ్‌లో బింజ్ వాచ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కానున్న ఆ టాప్ టెన్ ప్రాజెక్ట్స్ విశేషాలు ఇక్కడ చూద్దాం.
ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే టాప్ 10 లిస్ట్ ఇదే
1. రోడీస్ రీబర్త్ (Roadies Rebirth) - అక్టోబర్ 16: కుర్రకారులో విపరీతమైన క్రేజ్ ఉన్న రియాలిటీ షో రోడీస్ కొత్త సీజన్ రాబోతోంది. రణ్‌విజయ్ సింగ్ హోస్ట్ చేస్తుండగా, అభిషేక్ మహాన్, బషీర్ అలీ, ప్రిన్స్ నరులా, నేహా ధూపియా, నిఖిల్, బాణీ జె లు గ్యాంగ్ లీడర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
2. ది ట్రాప్ (The Trap) - అక్టోబర్ 13: ఒక చెల్లెలి హత్య తర్వాత 10 సంవత్సరాలు బయటకు రాకుండా గడిపిన ఆథర్ లిసా కాన్రాడ్ కథతో రూపొందిన జర్మన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది.
3. హార్మోనల్: సుముఖి సురేష్ (Hormonal) - అక్టోబర్ 14: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సుముఖి సురేష్ సింగిల్ లైఫ్, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, డేటింగ్ డిజాస్టర్లపై నవ్వులు పూయించే స్పెషల్ షో.
4. ఈవిల్ డెడ్ బర్న్ (Evil Dead Burn) - అక్టోబర్ 16: సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ మూవీ. భర్త మరణం తర్వాత అత్తగారింటికి వెళ్లిన ఐస్ జీవితంలో జరిగే వింత సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది.
{{/usCountry}}4. ఈవిల్ డెడ్ బర్న్ (Evil Dead Burn) - అక్టోబర్ 16: సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ మూవీ. భర్త మరణం తర్వాత అత్తగారింటికి వెళ్లిన ఐస్ జీవితంలో జరిగే వింత సంఘటనల ఆధారంగా ఇది తెరకెక్కింది.
{{/usCountry}}5. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌లైన్స్ (Final Destination Bloodlines) - అక్టోబర్ 16: సూపర్ నేచురల్ హారర్ జోనర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఫైనల్ డెస్టినేషన్' సిరీస్ నుంచి వస్తున్న ఆరో భాగం ఇది.
6. ద స్టార్మ్ (The Storm) - అక్టోబర్ 15: జోసెఫిన్ బోర్న్‌బుష్ డైరెక్ట్ చేసిన డార్క్ కామెడీ సినిమా. పుట్టినరోజు వేడుక కోసం ఒక లాడ్జికి వెళ్లిన స్నేహితులు తుఫానులో చిక్కుకుని.. బయటపెట్టే నిజాల చుట్టూ ఇది తిరుగుతుంది.
7. మనీ ట్రాప్: ది కార్టూన్ ట్రెజర్ (Money Trap) - అక్టోబర్ 16: టర్కిష్ కామెడీ క్రైమ్ షో. నేర ప్రపంచం వీడే ముందు ఒక దొంగ.. తనకు దొరికిన నిధి మ్యాప్ ఆధారంగా సాహసయాత్ర చేసే కథ ఇది.
8. టైసన్ (Tyson) - అక్టోబర్ 13: అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ జీవిత విశేషాలతో కూడిన 4 ఎపిసోడ్‌ల ఇంటెన్స్ డాక్యుమెంటరీ సిరీస్.
9. వితిన్ (Within) - అక్టోబర్ 15: ఒక కొత్త ఇంటికి మారిన భార్యాభర్తలు, వారి కూతురు ఎదుర్కొన్న భయానక అనుభవాలతో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ఇది.
10. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (How to Train Your Dragon) - అక్టోబర్ 13: వైకింగ్స్, డ్రాగన్ల మధ్య సాగే పోరాటం ఆధారంగా రూపొందిన ఫ్యామిలీ అడ్వెంచర్ యానిమేషన్ చిత్రం.