...
...
Next Story

Netflix Release: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. తెలుగు హారర్ కామెడీ నుంచి థ్రిల్లర్ మూవీ వరకు..

Netflix Release: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం ఏకంగా 9 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు అలరించడానికి సిద్ధమయ్యాయి. వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు తాప్సీ పన్ను నటనతో ఊపేసే 'గాంధారీి, హిలేరియస్ కల్ట్ ఫ్రాంచైజీ 'ధమాల్ 4' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.

Published on: Aug 31, 2026, 15:21:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Release: ఓటీటీ ప్రేమికులకు నెట్‌ఫ్లిక్స్ మరోసారి ఊహించని వినోదాన్ని అందించడానికి సిద్ధమైంది. థియేటర్లకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేలా పవర్‌ఫుల్ లైనప్‌ను సిద్ధం చేసింది.

Netflix Release: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. తెలుగు హారర్ కామెడీ నుంచి థ్రిల్లర్ మూవీ వరకు..
Netflix Release: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాలు, వెబ్ సిరీస్ జాతర.. తెలుగు హారర్ కామెడీ నుంచి థ్రిల్లర్ మూవీ వరకు..

సెప్టెంబర్ మొదటి వారంలోనే (సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్య) ఏకంగా 9 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్‌కు తీసుకువస్తోంది. వీటిలో యాక్షన్, కామెడీ, హారర్, థ్రిల్లర్ తో పాటు రియాలిటీ కంటెంట్ పుష్కలంగా ఉంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు', తాప్సీ 'గాంధారీ' డిజిటల్ ఎంట్రీ

ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో అలరించబోయే ప్రధాన చిత్రాల్లో తెలుగు హారర్ కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోపిష్టి కనకరాజు పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. కొరియా వెళ్లాలనుకునే చైత్ర అనే అమ్మాయి, కనకరాజు జీవితం చుట్టూ తిరిగే ఈ కథ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ 'గాంధారి' (Gandhari) సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ కానుంది. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన తన కూతురిని వెతుక్కునే ఒక తల్లి పోరాటం, ఆ క్రమంలో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.

'ధమాల్ 4' నవ్వుల విందు.. 'ద జెంటిల్‌మెన్ 2' యాక్షన్ ధమాకా

బాలీవుడ్ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 'ధమాల్ 4' (Dhamaal 4) సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌పైకి రానుంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రల్లో నవ్వించేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమాలతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఈ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనున్నాయి.

1. అన్‌టోల్డ్ రేగన్: బ్రేకింగ్ బ్యాడ్లీ (సెప్టెంబర్ 1): 2024 ఒలింపిక్స్ అరంగేట్రం తర్వాత వైరల్ మీమ్స్, వివాదాల్లో చిక్కుకున్న బ్రేక్‌డాన్సర్ రేచెల్ రేగన్ జీవిత ఆధారంగా రూపొందిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ.

2. జెరెడ్ ఫ్రైడ్: ద ఫ్యామిలీ ప్లాన్ (సెప్టెంబర్ 1): కుటుంబ నేపథ్యంతో సాగే పక్కా కామెడీ స్టాండప్ షో.

3. ఫిటో పేజ్: ద వరల్డ్ విత్ ఇన్ ఏ సాంగ్ (సెప్టెంబర్ 3): లాటిన్ మ్యూజిషియన్ ఫిటో పేజ్ జీవిత విశేషాలతో కూడిన స్పాన్సిన్ డాక్యుమెంటరీ.

4. టీనేజ్ వేస్ట్‌ల్యాండ్ (సెప్టెంబర్ 4): 1991 న్యూయార్క్ నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డాక్యుమెంటరీ.

5. ఇయర్ల్ మీట్స్ వరల్డ్ (సెప్టెంబర్ 4): జెన్-జీ (Gen-Z) స్టార్ అలిక్స్ ఇయర్ల్ బిజినెస్, లైఫ్‌స్టైల్ ఆధారంగా తెరకెక్కిన రియాలిటీ సిరీస్.

వీకెండ్‌లో అదిరిపోయే వినోదం కోసం చూస్తున్న ఓటీటీ ప్రియులకు ఈ వారం నెట్‌ఫ్లిక్స్ అందించే లైనప్ విందు భోజనం లాంటిదని చెప్పవచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe