OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ లవర్స్ గెట్ రెడీ..ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు బ్లాక్ బస్టర్..కొరియన్ ఆత్మ మిస్టరీ
OTT Horror Thriller: తెలుగు ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. మీకు అదిరిపోయే థ్రిల్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ అందించేందుకు బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ రాబోతుంది. ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఏంటీ? ఓటీటీ వివరాలు ఏంటీ? అనేదానిపై ఓ లుక్కేయండి.
OTT Horror Thriller: టాలీవుడ్ లో ఇప్పుడు కమ్ బ్యాక్ ల కాలం నడుస్తోంది. హీరోలందరూ వరుసగా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లతో అదరగొడుతున్నారు. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తన కెరీర్ లో అందుకున్న భారీ హిట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. థియేటర్లలో అదరగొట్టిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

హారర్ థ్రిల్లర్
హారర్ థ్రిల్లర్లకు ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరే లెవల్. ఇక అందులోనూ తెలుగు హారర్ థ్రిల్లర్ వచ్చిందంటే మన తెలుగు జనాలు ఎగబడి మరి చూస్తారు. అలాంటి ఆడియన్స్ ను మరోసారి ఎంటర్ టైన్ చేసేందుకు కొరియన్ కనకరాజు ఓటీటీలోకి వచ్చేస్తోంది. హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు.
స్టోరీ ఏంటంటే?
కొరియన్ కనకరాజు సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోహీరోయిన్లుగా నటించారు. అనంతపురానికి చెందిన వరుణ్ తేజ్ కు కోపమెక్కువ. అతను కియా కంపెనీలో పనిచేసే హీరోయిన్ లవ్ చేస్తాడు. అయితే హీరోయిన్ కు ఏమో కొరియా వెళ్లాలనేది కోరిక.
అయితే అనుకోని పరిస్థితుల్లో కొరియాలోని ఓ డాన్ ఆత్మ అనంతపురం చేరుకొని హీరో బాడీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ డాన్ ఎవరు? ఆత్మను అంతం చేయడానికి హీరో తన ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాల్సి వచ్చిందనేది కొరియన్ కనకరాజు మూవీలో చూడాల్సిందే.
కొరియన్ కనకరాజు ఓటీటీ
మేర్లపాక గాంధీ తెరకెక్కించిన కొరియన్ కనకరాజు మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ హారర్ థ్రిల్లర్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ఎందుకు చూడాలంటే?
ఓటీటీలో కొరియన్ కనకరాజు మూవీని చూసేందుకు కొన్ని కారణాలున్నాయి. వరుణ్ తేజ్ కు ఏడేళ్ల తర్వాత విక్టరీని అందించిన మూవీ ఇది. కనకరాజుగా, కొరియన్ డాన్ గా వరుణ్ తేజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక రితికా నాయక్ గ్లామర్ తో అలరించింది. మరోవైపు సత్య తన కామెడీతో నవ్వులు పంచాడు.
కామెడీ, మిస్టరీ, హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కావాలనుకునే వాళ్లకు కొరియన్ కనకరాజు మూవీ మంచి ఛాయిస్. ఫ్యామిలీ మొత్తం హాయిగా చూడొచ్చు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


