OTT Review: నెట్‌ఫ్లిక్స్‌లోకి తాజాగా తెలుగులోనూ వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ నవ్వులు పూయిస్తోంది. ఫస్ట్ నైటే రోజే మొగుడికి షాకిచ్చే అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీకెండ్ చూడొచ్చా? ఈ రివ్యూలో తెలుసుకోండి.
మొద రాత్రి మూవీ విశేషాలు

సినిమా పేరు : మొద రాత్రి (Modha Rathiri)
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ డేట్ : సెప్టెంబర్ 18
IMDb రేటింగ్ : 7.9 / 10
జానర్ : ఫ్యామిలీ కామెడీ డ్రామా
నటీనటులు : రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్
ఫస్ట్ నైట్ రోజే ఊహించని ట్విస్ట్
ఫస్ట్ నైట్ రోజే కొత్త పెళ్లికూతురు వేరేవాడితో లేచిపోవడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుంది? అది కూడా మొగుడే స్వయంగా లవర్ దగ్గరికి తీసుకెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి విచిత్రమైన కాన్సెప్ట్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చి 7.9 ఐఎండీబీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది 'మొద రాత్రి' అనే తమిళ కామెడీ డ్రామా మూవీ.
దుబాయ్ నుంచి ఊరికి తిరిగొచ్చిన మరుథు (రిషికాంత్)కి ఇంట్లో వాళ్ళు బలవంతంగా ముత్తుసెల్వి (అనిష్మా అనిల్ కుమార్) అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. అయితే ముత్తుసెల్వి ఒక అథ్లెట్.. ఆమె అప్పటికే వేరే ఒకరిని ప్రేమిస్తుంది. మనసంతా లవర్ మీద ఉండటంతో ఈ పెళ్లి ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు.
ఇక పెళ్లయ్యాక తొలి రాత్రే అసలు కథ మొదలవుతుంది. తమిళంలో 'మొద రాత్రి' అంటే శోభనం రాత్రి అని అర్థం. ఆ మొదటి రోజే ఇంట్లో నుంచి పారిపోవాలని ముత్తుసెల్వి ప్లాన్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన మరుథు గొడవ చేయకుండా చాలా కూల్‌గా ఆలోచిస్తాడు. ఆమెని అర్థం చేసుకుని సీక్రెట్‌గా లవర్ దగ్గరికి తీసుకెళ్లేందుకు హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు.
మిడ్‌నైట్ ట్విస్ట్.. అడవి దారిలో కొత్త జంట
కానీ సరిగ్గా లవర్ దగ్గరికి వెళ్లే చివరి నిమిషంలో ఆ ప్రియుడు హ్యాండ్ ఇస్తాడు. ముత్తుసెల్విని కలవడానికి అస్సలు ఒప్పుకోడు. దీంతో అర్ధరాత్రి వేళ ఆ జంట నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోతారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి రోడ్ ట్రిప్ మొదలవుతుంది.
{{/usCountry}}కానీ సరిగ్గా లవర్ దగ్గరికి వెళ్లే చివరి నిమిషంలో ఆ ప్రియుడు హ్యాండ్ ఇస్తాడు. ముత్తుసెల్విని కలవడానికి అస్సలు ఒప్పుకోడు. దీంతో అర్ధరాత్రి వేళ ఆ జంట నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోతారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరి రోడ్ ట్రిప్ మొదలవుతుంది.
{{/usCountry}}మరోవైపు ఇంట్లో వాళ్ళు వీళ్లిద్దరూ కనిపించకపోవడంతో రకరకాల కథలు అల్లేస్తుంటారు. ఊర్లో లేనిపోని పుకార్లు షికారు చేస్తాయి. ఒక పక్క లవర్ ద్రోహం, ఇంకో పక్క రాత్రి వేళల్లో అనుకోని ప్రయాణం.. ఈ రెండింటి మధ్య నవ్వులు పూయించే సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్ బాగా కుదిరాయి.
సినిమా ఎలా ఉందంటే?
ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా సింపుల్ స్టోరీలైన్ తీసుకుని ఎక్కడా బోర్ కొట్టకుండా హ్యూమర్‌తో నడిపించారు. బలవంతపు పెళ్లిళ్లు, కుటుంబాల ఒత్తిడి లాంటి సీరియస్ పాయింట్‌ని ఎక్కడా భారీ సందేశాలు ఇవ్వకుండా సరదాగా చూపించారు.
రిషికాంత్, అనిష్మా ఇద్దరూ తమ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద ప్రయాణం సాగుతున్న కొద్దీ వాళ్ళ మధ్య ఏర్పడే కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, నైట్ షాట్స్ క్యాప్చర్ చేసిన సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి.
అయితే సెకండ్ హాఫ్‌లో రోడ్ ట్రిప్ సీన్స్ కాస్త స్లో అయినట్టు అనిపిస్తాయి. కథ ఎలా ముగుస్తుందో ముందే గెస్ చేసేలా ఉండటం, లవర్ హ్యాండ్ ఇవ్వడం అనే పాయింట్ పాత సినిమాల్లా అనిపించడం చిన్న లోపం.
థియేటర్లలో పర్వాలేదనిపించిన ఈ చిన్న సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ని బాగానే అలరిస్తోంది. వీకెండ్‌లో పెద్దగా అంచనాలు లేకుండా ఒక లైట్ హార్టెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లేదా ఫన్నీ రోడ్ ట్రిప్ మూవీ చూడాలనుకుంటే 'మొద రాత్రి' ఒక మంచి ఛాయిస్.