...
...
Next Story

ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి జాన్వీ కపూర్ నటించిన మూవీ వస్తోంది. ఈసారి ఇండియా నుంచి ఆస్కార్స్ కి అధికారిక ఎంట్రీ అయిన హోమ్‌బౌండ్ మూవీ ఇది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా వచ్చే వారం డిజిటల్ ప్రీమియర్ కానుంది.

Published on: Nov 14, 2025, 15:03:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

జాన్వీ కపూర్ నటించిన మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన, విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ డ్రామా మూవీ 'హోమ్‌బౌండ్'. ఈ సినిమా నవంబర్ 21న డిజిటల్ ప్రీమియర్ కానుంది. సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తర్వాత ఇండియా నుంచి ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీగా నిలిచింది. 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా ఎంపికైంది.

'హోమ్‌బౌండ్' ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ.. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీ ఇది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటించిన మూవీ హోమ్‌బౌండ్. ఈ సినిమా సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ కాగా.. నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రఖ్యాత దర్శకుడు మార్టిన్ స్కోర్సెసే ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించిన ‘హోమ్‌బౌండ్’.. నార్త్ ఇండియా నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. మొహమ్మద్ షోయబ్ అలీ (ఇషాన్ ఖట్టర్), చందన్ కుమార్ (విశాల్ జేత్వా) చుట్టూ తిరుగుతుంది. వీరిద్దరూ పోలీస్ అధికారులు కావాలని కలలు కంటుంటారు.

ప్రభుత్వ ఉద్యోగం ద్వారా పొందాలనుకునే గౌరవం, ఆత్మగౌరవానికి ఎదురయ్యే సవాళ్లేంటన్నది ఈ హోహ్‌బౌండ్ మూవీలో చూడొచ్చు. మత, కుల అసమానతలు వాళ్ల కలలకు ఎలాంటి అడ్డంకులు సృష్టించాయో డైరెక్టర్ ఘైవాన్ ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించాడు.

హోమ్‌బౌండ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

2020లో కశ్మీరీ రచయిత బషరత్ పీర్ రాసిన ఒక న్యూయార్క్ టైమ్స్ కథనం ఈ సినిమాకు స్ఫూర్తినిచ్చిందని చెబుతున్నారు. ఆ కథనం COVID-19 లాక్‌డౌన్ సమయంలో యువ వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలను వివరించింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర.. అణగారిన వర్గాలు ఎదుర్కొనే నిర్మాణాత్మక అడ్డంకులకు అద్దం పడుతుంది.

దేశీయంగా విడుదలైన తర్వాత కూడా ఘైవాన్ సాహసోపేతమైన దర్శకత్వం, బలమైన డైలాగులు, ముఖ్యంగా లీడ్ యాక్టర్స్ అద్భుతమైన నటన విమర్శకులను ప్రశంసలు అందుకున్నాయి. కుల వివక్ష, సామాజిక కథనాన్ని సున్నితంగా చూపినందుకు ఈ సినిమా ఇండియా నుంచి ఆస్కార్స్ కు అధికారిక ఎంట్రీగా వెళ్లింది. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన అభిమానులు నవంబర్ 21 నుండి నెట్‌ఫ్లిక్స్ లో చూడవచ్చు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks