...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ మూవీ.. లేడీ డాక్టర్ చేసే లైంగిక దాడులు.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో ఆసక్తికరమైన సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతోంది. కరణ్ జోహార్ నిర్మించిన 'అక్యూజ్డ్' (Accused) మూవీలో కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రాంత ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక లేడీ డాక్టర్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణల చుట్టూ తిరిగే ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీ, కథా విశేషాలు ఇక్కడ చూడండి.

Published on: Feb 9, 2026, 15:04:01 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకురాలు కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రలో నటించిన తాజా సినిమా 'అక్యూజ్డ్' (Accused). కరణ్ జోహార్‌కు చెందిన ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఫిబ్రవరి 27న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్, ఉత్కంఠభరితమైన టీజర్‌ను కూడా విడుదల చేశారు.

అక్యూజ్డ్ కథేంటంటే..

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ మూవీ.. లేడీ డాక్టర్ చేసే లైంగిక దాడులు.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో థ్రిల్లర్ మూవీ.. లేడీ డాక్టర్ చేసే లైంగిక దాడులు.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్

సైకలాజికల్ థ్రిల్లర్ అయిన అక్యూజ్డ్ సినిమా కథ డాక్టర్ గీతిక (కొంకణా సేన్ శర్మ) జీవితం చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ప్రముఖ ఆసుపత్రిలో అతిపిన్న వయసులో హెచ్‌ఓడీ (HOD) అయిన గైనకాలజిస్ట్. తన కెరీర్‌లో ఉన్నత స్థానంలో ఉండి, డీన్ పదవికి పోటీ పడుతున్న సమయంలో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది.

ఆమెపై తీవ్రమైన 'లైంగిక ఆరోపణలు' వస్తాయి. అప్పటివరకు మచ్చలేని రికార్డు, గొప్ప వైద్యురాలిగా పేరున్న ఆమెను.. ఒక్క ఆరోపణతో సమాజం, అధికారులు, సహచరులు ఒక నేరస్తురాలిగా చూడటం మొదలుపెడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆమె నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడిందా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.

భార్యగా ప్రతిభా రాంత.. సంక్లిష్టమైన కథ

ఈ సినిమాలో గీతిక ఒక LGBTQ పాత్రలో కనిపిస్తుండటం గమనార్హం. ఆమె భార్యగా 'లాపతా లేడీస్' ఫేమ్ ప్రతిభా రాంత నటించింది.. సమాజమంతా గీతికను నిందిస్తుంటే.. బయటి ఒత్తిళ్లకు తలొగ్గాలా? లేక ప్రపంచం రాక్షసిగా చూస్తున్న తన భాగస్వామికి అండగా నిలబడాలా? అనే సందిగ్ధంలో ఆమె పాత్ర సాగుతుంది.

అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అధికారం, నైతికత, పక్షపాతం వంటి అంశాలను లోతుగా చూపిస్తుంది. కోర్టు డ్రామా కంటే ఆరోపణల వల్ల మనుషుల మధ్య సంబంధాలు ఎలా దెబ్బతింటాయనే కోణంలో ఈ సినిమా సాగుతుందని మూవీ టీమ్ తెలిపింది. ఇందులో ఆదిత్య నందా, సుకాంత్ గోయెల్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ 2026 లైనప్‌లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe