ఇవాళ ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్- ఒక రాత్రిలో కార్లో ఇద్దరితోనే సినిమా- దిమ్మతిరిగే ట్విస్ట్

ఇవాళ ఓటీటీలోకి ఓ సైకలాజికల్ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ మూవీలో రెండు పాత్రలు రాత్రి ఒక కార్లో ప్రయాణిస్తాయి. ఈ ఇద్దరి చుట్టూనే మూవీ సాగుతోంది. కానీ చిత్రంలో వచ్చే సౌండ్ ఎఫెక్ట్, చీకటి మాత్రం వణికిస్తాయి. ఆఖర్లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది.

Published on: Jan 6, 2026, 10:59:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. కంటెంట్ ఎంత డిఫరెంట్ గా ఉంటే ఆడియన్స్ కు అంతగా రీచ్ అవుతున్నాయి. ముఖ్యంగా థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. ఇవాళ ఓటీటీలోకి అలాంటి ఓ సైకలాజిక్ థ్రిల్లరే వచ్చింది. అదే ‘హాలో రోడ్’. మంగళవారం ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా చూస్తే కచ్చితంగా వెన్నులో వణుకు పుట్టాల్సిందేననే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక రాత్రిలో కార్లో ఇద్దరి ప్రయాణం చుట్టూ స్టోరీ సాగుతుంది. ఆఖర్లో దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది.

ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్ (x)
ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్ (x)

హాలో రోడ్ ఓటీటీ

ఓటీటీలో ఈ వారం కూడా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (జనవరి 6) మరో కొత్త మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ హాలో రోడ్ ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో సత్తాచాటిన ఈ మూవీ ఓటీటీలోనూ వణికిస్తోంది.

ఏడు నెలల తర్వాత

థియేటర్లో రిలీజైన ఏడు నెలల తర్వాత హాలో రోడ్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఈ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మే 16, 2025న థియేటర్లో రిలీజైంది. ఇప్పుడు జనవరి 6, 2026న ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో రాస్మండ్ పైక్, మాథ్యూ రైస్ కీలక పాత్రలు పోషించారు. దీనికి బాబక్ అన్వారి డైరెక్టర్.

హాలో రోడ్ మూవీ స్టోరీ

హాలో రోడ్ సినిమా అనేది ఓ సైకలాజికల్ థ్రిల్లర్. సస్పెన్స్ తో ఊపేసే మూవీ ఇది. ఓ రాత్రి కార్లో ఇద్దరు వ్యక్తుల ప్రయాణం చుట్టూ సాగుతోంది ఈ హాలో రోడ్. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు, సౌండ్ ఎఫెక్ట్స్ భయపెడతాయి.

మ్యాడీ, ఫ్రాంక్ భార్యభర్తలు. వాళ్లకు ఓ టీనేజ్ కూతురు అలీస్ ఉంటుంది. ఓ రోజు ఆ టీనేజ్ కుమార్తె ఓ రోడ్డు ప్రమాదానికి గురైందని తెలుస్తుంది. ఆమె ఓ వ్యక్తిని ఢీకొట్టిందని చెప్తారు. తమ కూతురు అక్కడి నుంచి పారిపోయిందని తెలుస్తుంది. వెంటనే ఆ రాత్రి తన భార్యను తీసుకుని ప్రమాదం జరిగిన దగ్గరకు మ్యాడీ భయల్దేరతాడు.

భ్రమలతో భయాలు

మ్యాడీ, ఫ్రాంక్ కార్లో హాలో రోడ్ లో ప్రయాణిస్తుంటారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? తమ కూతురుకు ఏమైనా అయిందా? ఢీ కొట్టిన వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నాడా? అనే ఆలోచనలతో మ్యాడీ భ్రమ పడుతుంటాడు. మరోవైపు వీళ్ల కారును ఆత్మలు వెంబడిస్తున్నట్లు కనిపిస్తుంది. మరి చివరకు తమ కూతురును వీళ్లు కలుసుకున్నారా? అసలు ఆ ప్రమాదం ఏంటీ? అన్నది హాలో రోడ్ మూవీలో చూడాల్సిందే. ఆఖర్లో ఓ ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More