Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు మూడు క్రేజీ సినిమాలు.. హారర్ కామెడీ నుంచి మాధవన్ బయోపిక్ వరకు..
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లోకి ఒకే రోజు మూడు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కో జానర్ మూవీ కావడం విశేషం. వీటిలో వరుణ్ తేజ్ నటించిన తెలుగు హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు కూడా ఒకటి.
Netflix: నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ ప్రియులకు ఈ వీకెండ్ క్రేజీ ట్రీట్ అందించింది. ఒకే రోజు ఏకంగా మూడు డిఫరెంట్ జానర్ సినిమాలను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై రిలీజ్ చేసి నెటిజన్లను సర్‌ప్రైజ్ చేసింది. ఆర్.మాధవన్ నటించిన బయోపిక్ 'జీడీఎన్' (G.D.N), యూనిక్ కాన్సెప్ట్ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’తో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ధమాల్ 4' ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేశాయి.

మాధవన్ చేసిన బయోపిక్ జీడీఎన్
ఇండియన్ ఎడిసన్‌గా పేరుగాంచిన ప్రసిద్ధ శాస్త్రవేత్త, ఆవిష్కర్త జి.డి.నాయుడు బయోపిక్‌గా తెరకెక్కిన 'జీడీఎన్' (G.D.N) మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వెర్సటైల్ నటుడు మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్.మాధవన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, పీరియాడిక్ డ్రామా, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలిచాయి. తెలుగులోనూ మూవీ అందుబాటులో ఉంది. ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. నెట్‌ఫ్లిక్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
రాయలసీమ రౌడీతో కొరియన్ గ్యాంగ్‌స్టర్..
ఇక వరుణ్ తేజ్ హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు కూడా ఈరోజే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. "ఒక రాయలసీమ రౌడీ, ఒక కొరియన్ గ్యాంగ్‌స్టర్.. ఒకే అడ్రస్" అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తోంది. సౌత్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న మరొక డిఫరెంట్ ప్రాజెక్ట్ ఈ ‘కొరియన్ కనకరాజు’. డిఫరెంట్ కాన్సెప్ట్, మాస్ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అయింది.
సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న కొత్త తరం సినిమాలు ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తున్నాయో 'కొరియన్ కనకరాజు' మరోసారి ప్రూవ్ చేస్తోంది. వీకెండ్ లో డిఫరెంట్ కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్.
ట్రెజర్ హంట్‌తో నవ్వుల వర్షం.. 'ధమాల్ 4' మిస్ కావద్దు
బాలీవుడ్ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 'ధమాల్ 4' (Dhamaal 4) కూడా నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ భారీ ఎత్తున సాగే ట్రెజర్ హంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు నాన్-స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.
అజయ్ దేవ్‌గన్, రితీష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ లాంటి స్టార్ కాస్టింగ్ కలయికలో వచ్చిన ఈ నాలుగో భాగం ఓటీటీ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీకెండ్ ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ తెచ్చిన ఈ మూడు ప్రాజెక్టులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


