...
...
Next Story

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన 8 మూవీస్, వెబ్ సిరీస్.. క్రైమ్ థ్రిల్లర్ టు కామెడీ

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఈవారం క్రైమ్ థ్రిల్లర్లు, పీరియాడిక్ డ్రామాలు, సైన్స్ ఫిక్షన్ యాక్షన్, పొట్టచెక్కలయ్యే కామెడీ షోలతో కూడిన అదిరిపోయే కంటెంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న టాప్ 8 సినిమాలు, సిరీస్‌ పూర్తి జాబితా, వాటి ఐఎండీబీ రేటింగ్ వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Nov 14, 2026, 10:44:12 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ జాబితాలో ఎన్నో వైవిధ్యమైన జానర్ల కంటెంట్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు టాప్ 8 సినిమాలు, వెబ్ సిరీస్ జాబితా ఇక్కడ చూడండి. ఈ వీకెండ్ వాటిని కవర్ చేసే ప్రయత్నం చేయండి.

1. దాయరా (Daayra) – IMDb రేటింగ్: 7.1 / 10

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన 8 మూవీస్, వెబ్ సిరీస్.. క్రైమ్ థ్రిల్లర్ టు కామెడీ
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వీకెండ్ మిస్ కాకుండా చూడాల్సిన 8 మూవీస్, వెబ్ సిరీస్.. క్రైమ్ థ్రిల్లర్ టు కామెడీ

బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్ తెరకెక్కించిన గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'దాయరా'. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్-10 జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

2019లో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఒక అత్యాచారం-హత్య కేసు, ఆ తర్వాత జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో దీనిని నిర్మించారు. 2 గంటల 23 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుంది.

2. రణబాలి (Ranabaali) – IMDb రేటింగ్: 7.3 / 10

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలోని రాయలసీమ (అనంతపురం) నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.

తీవ్ర కరువు, పంట నష్టంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయంలో, బ్రిటిష్ అధికారులు కనీస కనికరం లేకుండా ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ అన్యాయంపై తిరగబడి, ఆంగ్లేయుల గుండెల్లో వణుకు పుట్టించిన ఓ వీరుడి కథే 'రణబాలి'.

3. ఢింఢోరా: సీజన్ 1 (Dhindora Season 1) – IMDb రేటింగ్: 8.7 / 10

ఒక మధ్యతరగతి కుటుంబానికి లాటరీ తగలడం, ఆ ఆనందంలో భార్య ఊరంతా చాటింపు వేయడం, ఆ వెంటనే భర్తకు యాక్సిడెంట్ అవ్వడంతో మొదలయ్యే గందరగోళం కడుపుబ్బా నవ్విస్తుంది. సీజన్ 2 చూసే ముందు దీనిని తప్పక చూడండి.

4. జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth) – IMDb రేటింగ్: 5.8 / 10

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను ఇష్టపడే వారి కోసం 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' అందుబాటులోకి వచ్చింది. గతంలో వచ్చిన 'జురాసిక్ వరల్డ్: డొమినియన్' సంఘటనలు జరిగిన ఐదేళ్ల తర్వాత ఈ కథ మొదలవుతుంది. డైనోసార్ల ప్రపంచంలోకి సాగే కొత్త సాహస యాత్ర, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం అలరిస్తుంది.

5. ది బాడీ (The Body) – IMDb రేటింగ్: 7.6 / 10

నవంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సైకలాజికల్ హారర్ డ్రామా సిరీస్ 'ది బాడీ'. ఒక క్యాథలిక్ హైస్కూల్‌లో చదువుకునే కొందరు అమ్మాయిల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

వారిలో ఒక అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో కోమాలోకి వెళ్లడంతో, ఆ స్కూల్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా ఊహించని, భయానక సంఘటనలు చోటుచేసుకుంటాయి. మిస్టరీ హారర్ ప్రియులకు ఇది మంచి ఛాయిస్.

6. నెవర్ సరెండర్ (Never Surrender) – IMDb రేటింగ్: 6.0 / 10

నెట్‌ఫ్లిక్స్ టాప్-10 సినిమాల జాబితాలో 6వ స్థానంలో ట్రెండ్ అవుతున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఒక మాజీ సైనికుడు, అతని కుటుంబం చుట్టూ ఈ కథ సాగుతుంది.

ఒక గ్రామంలో అరాచకాలు సృష్టించే ప్రమాదకరమైన నేరగాళ్ల ముఠాతో ఆ మాజీ సైనికుడు, అతని మనవలు, మనవరాళ్లు కలిసి ఎలా పోరాడారనేది ఎంతో ఆసక్తికరంగా చూపించారు.

7. ఇండియాస్ గాట్ లేటెంట్ (India's Got Latent – న్యూ ఎపిసోడ్) – IMDb రేటింగ్: 8.8 / 10

కమెడియన్ సమయ్ రైనా నిర్వహిస్తున్న పాపులర్ కామెడీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' తాజా ఎపిసోడ్ ఇటీవలే విడుదలైంది. ఈ ఎపిసోడ్‌కు ప్రముఖ కమెడియన్ కృష్ణ అభిషేక్, బాలీవుడ్ నటి హుమా ఖురేషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

షోలో భాగంగా హుమా ఖురేషి నటించిన 'టాక్సిక్' సినిమాపై సమయ్ రైనా వేసిన సెటైర్లు, కృష్ణ అభిషేక్ పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.

8. మేడమ్ ఇన్‌స్పెక్టర్ (Madam Inspector) – IMDb రేటింగ్: 5.9 / 10

బెంగాలీ భాషలో రూపొందిన ఆసక్తికరమైన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రెండో పెళ్లికి సిద్ధమవుతున్న విడాకులు తీసుకున్న మహిళలు.. సరిగ్గా తమ పెళ్లి మొదటి రాత్రి లేదా ఆ సమయంలోనే వరుసగా హత్యకు గురవుతుంటారు. ఈ మిస్టరీ హత్యల వెనుక ఉన్న కిల్లర్‌ను పట్టుకునే బాధ్యతను సబ్-ఇన్‌స్పెక్టర్ చిత్రా బసు తీసుకుంటుంది.

ఈ వీకెండ్ లో మీ మూడ్‌కు తగ్గట్టుగా కడుపుబ్బా నవ్వే కామెడీ నుంచి నరాలకు పరీక్ష పెట్టే సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు నెట్‌ఫ్లిక్స్‌లో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీ వీకెండ్ వాచ్‌లిస్ట్‌ను ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks