Ranabaali OTT: నెల కాకముందే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రణబాలి- ఇంత త్వరగా స్ట్రీమింగ్‌కి కారణాలు ఏంటంటే?
Ranabaali OTT Release Official Announcement: ఓటీటీలోకి రణబాలి సినిమా వచ్చేయనుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా రాణించలేకపోయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నెల రోజులు కాకముందే 5 భాషల్లో రణబాలి ఓటీటీలో ప్రసారమవనుంది.
Ranabaali OTT Streaming Official Announcement: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం రణబాలి ఓటీటీలోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలోనే రణబాలి ఓటీటీ వేదికపైకి వస్తోంది.

ఓటీటీలోకి రణబాలి
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని ఇవాళ నవంబర్ 9న అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది. "సింగనమల బొబ్బిలి రణబాలి వస్తున్నాడు" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సోషల్ మీడియా వేదికగా రణబాలి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
5 భాషల్లో నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్
విజయ్ దేవరకొండ, రష్మికల మాస్ పోస్టర్‌ను పంచుకుంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేసింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో 'సౌత్‌వర్స్' (Southverse) అని సెర్చ్ చేయడం ద్వారా ఈ చిత్రాన్ని సులభంగా చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన రూ. 120 కోట్ల ప్రాజెక్ట్
సాధారణంగా హిందీ చిత్రాలు థియేటర్లలో విడుదలయ్యాక 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. దక్షిణాది చిత్రాలు మాత్రం 4 వారాల విండో నిబంధనను పాటిస్తాయి. అయితే రణబాలి చిత్రానికి థియేట్రికల్ విండో పెద్దగా కలసి రాలేదు. అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి రోజున దేశవ్యాప్తంగా రూ. 9.25 కోట్ల నెట్ వసూళ్లతో బోణీ చేసింది. ఆ తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
రెండో వారం ఆఖరి నాటికి రోజువారీ వసూళ్లు రూ. 1 కోటి కంటే దిగువకు చేరాయి. ఇక మూడో వారంలో మొత్తం కలిపి కేవలం రూ. 1.6 కోట్లు మాత్రమే వసూలు చేసింది రణబాలి సినిమా. నవంబర్ 8 నాటికి ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
భారతీయ బాక్సాఫీస్ వద్ద రణబాలి సినిమా మొత్తం రూ. 58 కోట్ల నెట్ వసూళ్లతో రన్ ముగించింది. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం తీవ్ర నిరాశ పరిచింది. విదేశాల్లో 1.4 మిలియన్ డాలర్లు మాత్రమే రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ఈ స్థాయిలో నష్టాలు రావడం ట్రేడ్ వర్గాలను నిరాశపరిచింది.
పెళ్లి తర్వాత వచ్చిన తొలి చిత్రం
ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలసి నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, టి-సిరీస్ ప్రెసెంట్ చేసింది.
19వ శతాబ్దపు బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఒక వీరుడి కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రసిద్ధ 'ది మమ్మీ' చిత్రాల నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాతోనే భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
రణబాలి సినిమా ప్రమోషన్ల సమయంలో రష్మిక మాట్లాడుతూ విజయ్ నటనను అల్లు అర్జున్ 'పుష్ప' నటనతో పోల్చారు. "స్క్రీన్ మీద రణబాలిగా విజయ్‌ను చూస్తున్నప్పుడు అసలు విజయ్ ఎక్కడా కనిపించలేదు. షూటింగ్ గ్యాప్‌లో మాట్లాడినప్పుడు కూడా రణబాలి పాత్ర ప్రభావమే కనిపించేది. నా విజు ఎక్కడికి వెళ్లాడో అనిపించేది" అని రష్మిక వ్యాఖ్యానించారు. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన రణబాలి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


