...
...
Next Story

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాల జాతర.. తెలుగు బ్లాక్‌బస్టర్ నుంచి అదిరే హారర్, క్రైమ్ థ్రిల్లర్ వరకు..

Netflix Releases This Week: ఈ వారం ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన వీక్షకుల కోసం సరికొత్త వినోదాల విందును సిద్ధం చేసింది. స్టార్ నటి కీర్తి సురేష్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'డోరతీ', వర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ 'గజబ్ రాత్'లతో పాటు నాని ది ప్యారడైజ్ వరకు ఎన్నో మూవీస్ రానున్నాయి.

Published on: Oct 20, 2026, 19:41:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Netflix Release Movies This Week: ఈ దసరా పండుగ వారంలో డిజిటల్ వీక్షకులను అలరించేందుకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సూపర్ కంటెంట్ తో సిద్ధమైంది. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ డ్రామాలు, హారర్ ఎంటర్టైనర్లు, సర్వైవల్ కథలతో పాటు ఎవర్‌గ్రీన్ క్లాసిక్ చిత్రాలను ఈ వారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. దక్షిణాది స్టార్ నటి కీర్తి సురేష్, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో పాటు ఏకంగా 8 విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయబోతున్నాయి.

ది ప్యారడైజ్ (The Paradise) - అక్టోబర్ 22

Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాల జాతర.. తెలుగు బ్లాక్‌బస్టర్ నుంచి అదిరే హారర్, క్రైమ్ థ్రిల్లర్ వరకు..
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్‌లో ఈవారం సినిమాల జాతర.. తెలుగు బ్లాక్‌బస్టర్ నుంచి అదిరే హారర్, క్రైమ్ థ్రిల్లర్ వరకు..

నాని నటించి బ్లాక్‌బస్టర్ ది ప్యారడైజ్ మూవీ అక్టోబర్ 22న నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. తెలుగు సహా వివిధ భాషల్లో ఈ మూవీ రానుండటం విశేషం. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ సక్సెస్ సాధించిన ఈ మూవీపై ఓటీటీలో మరిన్ని భారీ అంచనాలు ఉన్నాయి.

2. ఇంగ్లీష్ వింగ్లీష్ (English Vinglish) – రిలీజ్ డేట్: అక్టోబర్ 20

అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ఇంగ్లీష్ వింగ్లీష్' (2012) నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కు వస్తోంది. ఇంగ్లీష్ రాదనే కారణంతో భర్త, పిల్లల నుంచి అవమానాలు ఎదుర్కొన్న ఒక సాధారణ భారతీయ గృహిణి, న్యూయార్క్‌లో ఇంగ్లీష్ నేర్చుకుని తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకుందనేది ఈ సినిమా కథ. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ క్లాసిక్ డ్రామా అక్టోబర్ 20 నుంచి అందుబాటులోకి రానుంది.

3. గల్లీ బాయ్ (Gully Boy) – రిలీజ్ డేట్: అక్టోబర్ 20

రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'గల్లీ బాయ్' (2019) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ముంబై వీధుల్లో పెరిగిన ఒక పేద కుర్రాడు తన ర్యాప్ సంగీతంతో దేశం మెచ్చిన ఆర్టిస్ట్‌గా ఎలా ఎదిగాడనే ప్రేరణాత్మక కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

4. ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్ (The Last House on the Left) – రిలీజ్ డేట్: అక్టోబర్ 21

పాపులర్ రొమాంటిక్ కామెడీ సిరీస్ 'నోబడీ వాంట్స్ దిస్' మూడో సీజన్ అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోవాన్ ( క్రిస్టెన్ బెల్), నోవా (ఆడమ్ బ్రాడీ) ఒకే ఇంట్లో కలిసి జీవించడం ప్రారంభించిన తర్వాత వారి మధ్య వచ్చే బంధాలు, సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లను హాస్యభరితంగా ఈ సీజన్‌లో చూపించనున్నారు.

6. సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (Surviving Hurricane Otis) – రిలీజ్ డేట్: అక్టోబర్ 23

మెక్సికోలోని అకాపుల్కో నగరాన్ని అతలాకుతలం చేసిన భయంకరమైన కేటగిరీ-5 'హరికేన్ ఓటిస్' తుఫాను నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న స్పానిష్ సర్వైవల్ డ్రామా ఇది. ప్రకృతి వైపరీత్యం నుంచి ప్రాణాలను దక్కించుకోవడానికి మనుషులు చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇది తెలుగు డబ్బింగ్ ఆప్షన్‌తో కూడా అందుబాటులోకి రానుంది.

7. డోరతీ (Dorothy) – రిలీజ్ డేట్: అక్టోబర్ 23

నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ కథానాయికగా నటించిన తమిళ బోల్డ్ మూవీ 'డోరతీ'. సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఒక ప్రశాంతమైన గ్రామంలో నివసించే ఇద్దరు చిన్ననాటి మిత్రుల జీవితాల్లోకి 'డోరతీ' అనే యువతి ప్రవేశించిన తర్వాత ఎలాంటి విపరీతమైన పరిణామాలు, మిస్టరీలు చోటుచేసుకున్నాయనేదే ఈ సినిమా ప్రధానాంశం. అక్టోబర్ 23న ఈ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కు రానుంది.

8. గజబ్ రాత్ (Gajab Raat) – రిలీజ్ డేట్: అక్టోబర్ 23

వర్సటైల్ నటుడు మనోజ్ బాజ్‌పేయీ లీడ్ రోల్‌లో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయీ అవినీతికి అలవాటు పడిన ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఒకే ఒక్క రాత్రిలో జరిగే అనూహ్యమైన సంఘటనలు, ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతుంది. ఒక రాత్రి ఒక మనిషి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చూపించే ఈ చిత్రం అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

థ్రిల్లర్, యాక్షన్, డ్రామా, హారర్ ప్రేమికులకు ఈ వారం నెట్‌ఫ్లిక్స్ సంపూర్ణ వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది ప్రేక్షకులకు నాని ది ప్యారడైజ్, కీర్తి సురేష్ 'డోరతీ', మనోజ్ బాజ్‌పేయీ 'గజబ్ రాత్' చిత్రాలు ఈ వారపు మస్ట్ వాచ్ ఆప్షన్లుగా నిలవనున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks