Netflix Releases: క్రైమ్ థ్రిల్లర్ల నుంచి హారర్ మిస్టరీ వరకు.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈవారం రాబోతున్న టాప్ 10 మూవీస్, సిరీస్
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ ఈ అక్టోబర్ రెండో వారంలో సినిమాలు, వెబ్ సిరీస్ జాతర ఉండనుంది. ఈ ఓటీటీలో రిలీజ్ కానున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ తెలుసుకోండి. క్రైమ్ థ్రిల్లర్ నుంచి హారర్ మిస్టరీ వరకూ చాలానే ఉన్నాయి.
Netflix Releases: నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు ఈ వారం కంటెంట్ పండుగ రాబోతోంది. అక్టోబర్ 5 నుంచి 11 మధ్యలో ఏకంగా 10 సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. బాలీవుడ్ స్టార్ పరిణీతి చోప్రా నటిస్తున్న 'రిపోర్టింగ్ లైవ్' క్రైమ్ థ్రిల్లర్ నుంచి మైండ్ బ్లాకింగ్ హాలీవుడ్ హారర్ మిస్టరీ మూవీస్, క్యూట్ కొరియన్ డ్రామాల వరకు ప్రతి జానర్‌లోనూ డిఫరెంట్ కంటెంట్ ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

పరిణీతి చోప్రా 'రిపోర్టింగ్ లైవ్', హాలీవుడ్ థ్రిల్లర్స్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), దేవేన్ భోజాని కాంబినేషన్‌లో వస్తున్న 'రిపోర్టింగ్ లైవ్' ఈ వారంలోనే మోస్ట్ ఎవైటెడ్ మూవీ. ఇసుక మాఫియా అక్రమాలను బయటపెట్టడానికి ఒక ధైర్యవంతురాలైన రిపోర్టర్, ఆమె కెమెరాపర్సన్ చేసే డేరింగ్ పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది. ధ్రువ్ రాఠీ డైరెక్ట్ చేసిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 9న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.
దీంతో పాటు అదే రోజు 'యానిమల్స్' అనే అమెరికన్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అవుతోంది. లాస్ ఎంజెల్స్ మేయర్ అభ్యర్థి కొడుకు కిడ్నాప్ కావడం, ఆ బాబుని కాపాడుకోవడానికి దంపతులు చేసే ప్రయత్నాలు, బయటపడే చేదు నిజాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి.
ఇక అక్టోబర్ 8న 'బిలో' అనే హారర్ మిస్టరీ వెబ్ సిరీస్ వస్తోంది. ఒక చిన్న పట్టణాన్ని భయపెట్టే వింత జీవి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకునే జాలరి కథగా ఇది తెరకెక్కింది.
కొరియన్ డ్రామా, క్రైమ్ సస్పెన్స్ సిరీస్‌లు
కే-డ్రామా (K-Drama) లవర్స్ కోసం 'టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్' అనే కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అక్టోబర్ 9 నుంచి అందుబాటులోకి రానుంది. ఆర్టిఫిషియల్ గుండె అమర్చిన ఒక రిచ్ వ్యాపారవేత్త, సర్జరీ జరిగే వరకు తన గుండెను ఛార్జింగ్ పెట్టుకుంటూ పడే తిప్పలు కామెడీగా చూపించబోతున్నారు.
ఇక పోలీస్ క్రైమ్ డ్రామాలు ఇష్టపడే వారి కోసం అక్టోబర్ 7న 'అన్‌ఫర్గెటబుల్' వెబ్ సిరీస్ వస్తోంది. ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉన్న క్యారీ వెల్స్ అనే ఎక్స్-డిటెక్టివ్ సంక్లిష్టమైన నేరాలను ఎలా ఛేదించిందనేది ఇందులో చూడవచ్చు.
అదే రోజు 'ఇన్‌సైడ్ ది సర్కిల్' అనే పొలిటికల్ థ్రిల్లర్ కూడా రిలీజ్ అవుతోంది. నలుగురు చిన్ననాటి స్నేహితుల దగ్గరకు ఒక వీడియో రావడం, ఆ తర్వాత స్టార్ట్ అయ్యే బ్లాక్‌మెయిలింగ్‌తో వారి ఫ్రెండ్‌షిప్ డేంజర్‌లో పడటం ఈ సిరీస్ మెయిన్ పాయింట్.
హారర్ కామెడీస్, డాక్యుమెంటరీలు ఇంకా మరెన్నో
సైన్స్ ఫిక్షన్ హారర్ లవర్స్ కోసం 2176వ సంవత్సరంలో అంగారక గ్రహం (మార్స్) నేపథ్యంలో సాగే 'ఘోస్ట్ ఆఫ్ మార్స్' అక్టోబర్ 9న రాబోతోంది.
దివంగత నటుడు, కమెడియన్ మార్టిన్ ముల్ జీవిత కథతో తెరకెక్కిన బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ సిరీస్ 'హూ ఈజ్ మార్టిన్ ముల్?' అక్టోబర్ 7న స్ట్రీమింగ్ కానుంది.
అంతేకాకుండా అడల్ట్ యానిమేషన్ విభాగానికి వస్తే 'హాంటెడ్ హోటల్ సీజన్ 2' అక్టోబర్ 9న రిలీజ్ కానుంది. దెయ్యాల హోటల్ నడిపే క్యాథరిన్ ఫ్రీలింగ్ ఫ్యామిలీ చేసే కామెడీ ఆడియెన్స్‌ను నవ్విస్తుంది.
ఇక అక్టోబర్ 7న 'రియల్ మెన్ సీజన్ 2' అనే ఇటాలియన్ అడల్ట్ కామెడీ వెబ్ సిరీస్ కూడా నెట్‌ఫ్లిక్స్ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీగా ఉంది.
నెట్‌ఫ్లిక్స్ అక్టోబర్ 5 నుంచి 11 వరకు రిలీజెస్
• రిపోర్టింగ్ లైవ్ (హిందీ సినిమా) : అక్టోబర్ 9 (క్రైమ్ థ్రిల్లర్)
• యానిమల్స్ (హాలీవుడ్ సినిమా) : అక్టోబర్ 9 (క్రైమ్ థ్రిల్లర్)
• బిలో (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) : అక్టోబర్ 8 (హారర్ మిస్టరీ)
• టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (కే డ్రామా): అక్టోబర్ 9 (రొమాంటిక్ కామెడీ)
• అన్‌ఫర్గెటబుల్ (డ్రామా వెబ్ సిరీస్) : అక్టోబర్ 7 (పోలీస్ క్రైమ్)
• ఘోస్ట్స్ ఆఫ్ హార్స్ (సై ఫి ఫిల్మ్) : అక్టోబర్ 9 (సైన్స్ ఫిక్షన్ హారర్)
• హు ఈజ్ మార్టిన్ ముల్ (డాక్యుమెంటరీ) : అక్టోబర్ 7 (బయోగ్రఫీ)
• ఇన్‌సైడ్ ద సర్కిల్ (వెబ్ సిరీస్) : అక్టోబర్ 7 (పొలిటికల్ థ్రిల్లర్)
• హాంటెడ్ హోటల్ సీజన్ 2 (యానిమేటెడ్) : అక్టోబర్ 9 (హారర్ కామెడీ)
• రియల్ మెన్ సీజన్ 2 (ఇటాలియన్ వెబ్ సిరీస్) : అక్టోబర్ 7 (అడల్ట్ కామెడీ)
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


