Romantic Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో అదిరిపోయే రొమాంటిక్ వెబ్ సిరీస్.. చాలా రిచ్‌గా ట్రైలర్.. క్రేజీ జోడీతో..
Romantic Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ వస్తోంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Romantic Web Series: నెట్‌ఫ్లిక్స్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డ్రామా ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన '#లవ్' (#Love) వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ప్రేమ విషయానికి వస్తే కెమిస్ట్రీ గెలుస్తుందా? లేక కాంపాటిబిలిటీ నెగ్గుతుందా?" అంటూ నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్ వేసిన క్వశ్చన్ నెటిజన్లను, ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకుంటోంది.

5 భాషల్లో గ్రాండ్ రిలీజ్... అక్టోబర్ 2న స్ట్రీమింగ్
ఈ మోస్ట్ అవైటెడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కాబోతోంది. సౌత్ ఆడియెన్స్ అందరికీ చేరువయ్యేలా ఒక్క భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి అందుబాటులోకి తెస్తున్నారు.
లాంగ్ వీకెండ్ హాలిడేస్ ప్లాన్ చేసుకునే ఓటీటీ లవర్స్‌కి ఈ వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి సోషల్ మీడియాలో ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
కెమిస్ట్రీ Vs కాంపాటిబిలిటీ... రిలేషన్‌షిప్స్ పై కొత్త కోణం
ఈ రోజుల్లో మారుతున్న రిలేషన్‌షిప్స్, యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉండే అట్రాక్షన్ లేదా కెమిస్ట్రీ మాత్రమే పెళ్లి లేదా ప్రేమ బంధాన్ని నిలబెడుతుందా, లేక ఆలోచనలు కలిసే కంపాటిబిలిటీ అవసరమా అనే మెయిన్ పాయింట్‌తో కథ సాగనుంది.
రెండు వేర్వేరు డేటింగ్ యాప్స్ నడిపే ఇద్దరి మధ్య మొదలయ్యే ప్రేమ, ఆ తర్వాత అది ఎక్కడికి దారి తీసిందన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ట్రైలర్లో కెమెస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, నటీనటుల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ చాలా నేచురల్‌గా అనిపిస్తున్నాయి. రొటీన్ రొమాంటిక్ కామెడీ సినిమాల్లా కాకుండా, కాస్త ప్రాక్టికల్ థాట్స్‌తో ఈ జనరేషన్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ 'సౌత్‌వర్స్' ప్రచారం... సౌత్ కంటెంట్‌కి విపరీతమైన క్రేజ్
దక్షిణాది సినిమాలకు ఓటీటీలో వస్తున్న విపరీతమైన ఆదరణను దృష్టిలో ఉంచుకుని నెట్‌ఫ్లిక్స్ 'సౌత్‌వర్స్' (Southverse) పేరుతో ప్రత్యేకమైన కేటగిరీని ప్రమోట్ చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సెర్చ్ బార్‌లో 'Southverse' అని టైప్ చేస్తే చాలు, సౌత్ ఇండియాకి చెందిన టాప్ క్లాస్ మూవీస్, వెబ్ సిరీస్‌లు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి.
''#లవ్' (#Love)' వెబ్ సిరీస్ ను కూడా ఈ సౌత్‌వర్స్ ప్రాజెక్ట్‌లో భాగంగానే భారీగా ప్రమోట్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను, ఇంటెన్స్ లవ్ స్టోరీలను ఆదరించే ఓటీటీ ఆడియెన్స్‌కి ఇది కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అక్టోబర్ 2న నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి టాక్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


