Netflix Web Series: నెట్‌ఫ్లిక్స్‌లో మరో బ్యూటీఫుల్ రొమాంటిక్ వెబ్ సిరీస్.. విడిపోయే జంట లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఆరోజే
Netflix Web Series: ఐకానిక్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను మైమరిపించిన స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ నిర్మించిన సరికొత్త రొమాంటిక్ డ్రామా సిరీస్ 'ఓ సాథీ రే' (O Saathi Re). అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Netflix Web Series: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మానసిక సంఘర్షణలు, ప్రేమలోని విభిన్న కోణాలను అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించే దర్శకుల్లో ఇంతియాజ్ అలీ అగ్రస్థానంలో ఉంటారు. కథలో ఎమోషనల్ డెప్త్ పండించడంలో దిట్ట అయిన ఆయన.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'ఓ సాథీ రే' (O Saathi Re) అనే వినూత్న వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఈ సిరీస్‌కి ఇంతియాజ్ అలీ క్రియేటర్, రైటర్, షోరన్నర్‌గా వ్యవహరించగా.. ఆరిఫ్ అలీ దర్శకత్వం వహించారు. విండో సీట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ ప్రాజెక్ట్‌లో అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విడిపోవడంలోని మాధుర్యం.. అసమాన ప్రేమ పాఠాలు
'ఓ సాథీ రే' వెబ్ సిరీస్ ఒక సాధారణ రొమాంటిక్ డ్రామా కాదు. ఆధునిక సంబంధాలలో ఉండే సంక్లిష్టతలను, సమానత్వం లేని ప్రేమను లోతుగా విశ్లేషించే కథాంశమిది. విడాకులు తీసుకోబోతున్న ఒక దంపతుల మధ్య అనుకోకుండా చిగురించే ప్రేమానురాగాలు, వారి జీవితాల్లో తీసుకొచ్చే ఊహించని మార్పులను ఈ సిరీస్ ప్రధానంగా చూపిస్తుంది.
ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే సరిపోదు, ఆ ప్రేమలో బ్యాలెన్స్ లేనప్పుడు బంధాలు ఎంత భారంగా మారతాయో ఇందులో ప్రతిబింబించారు. కలవడమే ప్రేమ కాదు, కొన్నిసార్లు ఇష్టపడిన వారిని స్వేచ్ఛగా వదిలేయడం కూడా ప్రేమేనని వివరిస్తూ రూపుదిద్దుకున్న ఓ మనసుకు హత్తుకునే కథనమిది. స్వచ్ఛమైన హృదయంతో, ఆధునిక సమాజంలోని సంబంధాలను ప్రశ్నించేలా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు.
“ఓ విడిపోయే జంట లవ్ స్టోరీ ఇది.. ఓ సాథీ రే.. డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఓ స్పెషల్ పోస్టర్ ను ట్వీట్ చేసింది. ఈ పోస్టర్ లో సిరీస్ లోని మూడు ప్రధాన పాత్రల ఇంటెన్స్ లుక్ చూడొచ్చు.
ఓ సాథీ రే వెబ్ సిరీస్ విశేషాలు
ఈ వెబ్ సిరీస్‌లోని పాత్రలకు అత్యుత్తమ నటీనటులను ఎంపిక చేసినట్లు మేకర్స్ తెలిపారు. సంక్లిష్టమైన ఎమోషన్లను పండించడంలో అదితి రావు హైదరి, అవినాష్ తివారీ, అర్జున్ రాంపాల్ పోటీపడి నటించారు.
నోస్టాల్జియా ఫీలింగ్ అందించే ఈ మోడ్రన్ లవ్ స్టోరీ డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. విభిన్నమైన ఎమోషనల్ డ్రామాలను, ఇంతియాజ్ అలీ శైలి పవర్‌ఫుల్ ప్రేమకథలను ఆస్వాదించే ఆడియెన్స్ కు 'ఓ సాథీ రే' ఒక మధురమైన డిజిటల్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేసిన మై వాపస్ ఆవూంగా మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ తోపాటు ఓటీటీలోనూ అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఇప్పుడు మరో లవ్ స్టోరీ కూడా రానుండటంతో ఈ సిరీస్ కోసం ఇంతియాజ్ అలీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


