Netflix Tamil: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న నాలుగు తమిళ సినిమాలు.. కామెడీ, యాక్షన్, థ్రిల్లర్.. అన్నీ ఈ ఏడాదివే..
Netflix Tamil: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ ఏడాది తమిళ చిత్ర పరిశ్రమ సాధించిన ఘనతపై ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకుంది. 'విశ్వనాథ్ & సన్స్', 'బత్తా', 'మొద రాత్రి', 'డోరోతి' వంటి తమిళ సినిమాలు తమ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది సృష్టించిన సంచలనాలను నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేకంగా హైలైట్ చేసింది.
Netflix Tamil: ఈ ఏడాది దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో తమిళ సినిమా తనదైన వినూత్న కథాంశాలు, మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌లతో గ్లోబల్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కోలీవుడ్ మూవీస్ విపరీతమైన వ్యూస్‌ను సాధిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India) తమ సోషల్ మీడియా వేదికగా "తమిళ సినిమా దిస్ ఇయర్" అంటూ ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను షేర్ చేస్తూ కొనియాడింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచిన 4 ప్రముఖ తమిళ సినిమాలను ఒకే పోస్టర్‌లో డిజైన్ చేసి షేర్ చేయడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేసిన ఆ 4 తమిళ చిత్రాలు ఇవే
1. విశ్వనాథ్ & సన్స్ (Vishwanath & Sons)
స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’. థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే ఇండియా వ్యాప్తంగా మోస్ట్ వాచ్‌డ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. సూర్య నటన, తండ్రీ-కొడుకుల మధ్య సాగే భావోద్వేగాలు ఓటీటీ వీక్షకులను విశేషంగా అలరించాయి.
2. బత్తా (Bathttha)
వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ ‘బత్తా’. ఒక గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలు, విజయ్ సేతుపతి మార్క్ టైమింగ్, చిన్న పిల్లాడు తనను బాత్రూమ్ లో లాక్ చేసిన తర్వాత గ్యాంగ్‌స్టర్ లో వచ్చే మార్పుని కామెడీతోపాటు మంచి మెసేజ్ జోడించి తీసిన విధానం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఉంది.
3. డోరోతి (Dorothy)
ఈ ఏడాది తమిళ సినిమా నుంచి వచ్చిన మరో ఆణిముత్యంలాంటి సినిమా డోరోతి. కాస్త బోల్డ్ కంటెంటే అయినా సమాజంలో ట్రాన్స్‌జెండర్ల సమస్యలను కళ్లకు కట్టిన మూవీ ఇది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. థియేటర్లలో క్రిటిక్స్ ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా.. నెట్‌ఫ్లిక్స్ లో మరింత దూసుకుపోతుంది.
4. మొద రాత్రి (Modha Rathri)
మొద రాత్రి మరో సర్‌ప్రైజ్ మూవీ. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిని సినిమా ఇది. ఇష్టం లేని పెళ్లి చేసుకొని మొదటి రాత్రే ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయే అమ్మాయి.. ఆమెకు సాయం చేసే భర్త చుట్టూ తిరిగే ఈ మూవీకి కూడా ఓటీటీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
గ్లోబల్ స్థాయిలో తమిళ కంటెంట్ క్రేజ్
గత కొద్దికాలంగా ప్రాంతీయ సరిహద్దులు చెరిగిపోయి ప్రతీ భాషా చిత్రానికి ఓటీటీలో ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లు తమిళ కంటెంట్‌కు ఇస్తున్న ప్రాధాన్యత వల్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న వీక్షకులు సైతం సబ్‌టైటిల్స్‌తో ఈ చిత్రాలను ఆస్వాదిస్తున్నారు.
సూర్య, విజయ్ సేతుపతి వంటి స్టార్ల ప్రాజెక్ట్‌లతో పాటు కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తుండటం తమిళ చిత్రసీమ సత్తాను చాటిచెబుతోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


