Baththa OTT: బాత్రూమ్‌లో గ్యాంగ్‌స్టర్ లాక్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి హిట్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్
Baththa OTT: వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ తమిళ మూవీ ‘బత్తా’ ఓటీటీలోకి రాబోతుంది. యాక్షన్, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి బత్తా మూవీ ఓటీటీ వివరాలపై ఓ లుక్కేయండి.
Baththa OTT: విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ డ్రామా 'బత్తా' (Baththa) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అక్టోబర్ 1, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు రెడీ అయింది.

బత్తా ఓటీటీ రిలీజ్ డేట్
బత్తా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. అక్టోబర్ 29, 2026 నుంచి ఈ బత్తా సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అధికారికంగా స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
సినిమా స్టోరీ ఏంటంటే?
1986 మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో ఈ బత్తా సినిమా కథ నడుస్తుంది. బత్తా (విజయ్ సేతుపతి) ఒక క్రూరమైన లోకల్ గ్యాంగ్‌స్టర్. తన పేరు చెబితేనే చుట్టుపక్కల అందరికీ వణుకు పుడుతుంది. అయితే అనుకోకుండా ఒకరోజు బత్తా ఒక స్కూల్ బాత్రూమ్‌లో లాక్ అయిపోతాడు.
బాత్రూమ్ లోనే బత్తా ఉండిపోతాడు. అప్పుడు అదే ఏరియాకు చెందిన శబరి అనే కుర్రాడు రంగంలోకి దిగుతాడు. ఆ పిల్లాడు భయపడుతూనే బత్తాను ఆ బాత్రూమ్ నుంచి ఎలా రక్షించాడు? ఆ సంఘటన తర్వాత బత్తా జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది ఈ సినిమా అసలు కథ. యాక్షన్‌తో పాటు ఎమోషన్, డార్క్ కామెడీ కలగలిపి ఈ మూవీని తెరకెక్కించారు.
కాస్ట్ అండ్ క్రూ
ఈ బత్తా సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా లిజోమోల్ జోస్ నటించింది. మాస్టర్ సాయి పృథ్విరాజ్ (శబరి), బేబీ సహస్ర శ్రీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ బాలాజీ తరణీధరన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించగా, సాయి అభ్యంకర్ సంగీతం అందించారు.
నెట్‌ఫ్లిక్స్ జోరు
ఇంటర్నేషనల్ పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ రీచ్ పెంచుకునే దిశగా బాగా ప్లాన్ చేస్తోంది. తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగులో వస్తున్న క్రేజీ సినిమాలను, కొత్త చిత్రాలను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తూ రేసులో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి లాంటి స్టార్ నటుడి బత్తా మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.
విజయ్ సేతుపతికి తమిళంలోనే కాదు తెలుగు సహా ఇతర సౌత్ ఇండియా భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. వీళ్లు ఓటీటీలో బత్తాను చూసే ఛాన్స్ ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


