Netflix Thriller: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ తాప్సీ పన్ను మరో పవర్‌ఫుల్ విమెన్ సెంట్రిక్ థ్రిల్లర్‌తో డిజిటల్ స్పేస్‌ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్ ఇండియా వేదికగా రాబోతున్న ఆమె లేటెస్ట్ మూవీ 'గాంధారి' (Gandhari) అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 3 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
గాంధారి ట్రైలర్ ఎలా ఉందంటే?

తాప్సీ పన్ను లీడ్ రోల్లో నటిస్తున్న గాంధారి మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం (ఆగస్ట్ 25) రిలీజ్ చేసింది. ఇందులో తన కూతురిని కోల్పోయే తల్లి పాత్రలో తాప్సీ నటించింది. ట్రైలర్ మొదట్లోనే ఆమె కూతురిని ఓ రైల్లో నుంచి ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. తన కూతురిని కాపాడే ప్రయత్నంలో ఆమె ప్రమాదానికి గురైన కళ్లు కోల్పోతుంది.
మహాభారతంలో భర్త కోసం గాంధారి కళ్లకు గంతలు కట్టుకోగా.. ఈ అభినవ గాంధారి కూతురి కోసం గాంధారిలా మారి కిడ్నాపర్ల కోసం వేట సాగిస్తుంది. ఆమె తన కూతురిని కాపాడుకుందా? ఆమె కూతురిలాగే కిడ్నాప్ కు గురైన పలువురు ఇతర బాలికల పరిస్థితి ఏమైంది అన్నది ఈ గాంధారిలో చూడొచ్చు.
'ఒక తల్లి.. ఒక కూతురు'.. అసలు గాంధారి కథేంటి?
నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు పోస్ట్ చేసిన కాప్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. "ఒక తల్లి, ఒక కూతురు, రంగులు మార్చే బహురూపుల నగరం.. అందరి ముసుగులు తొలగించడానికి గాంధారి వస్తోంది" అంటూ రాసుకొచ్చిన లైన్స్ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
ఒక తల్లి తన కూతురి రక్షణ కోసం, ఆమెను కాపాడుకోవడం కోసం ఏ స్థాయికైనా తెగించే ఇంటెన్స్ మదర్-డాటర్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. సమాజంలో మంచివాళ్లలా నటిస్తూ ముసుగులు వేసుకున్న క్రూరుల అసలు స్వరూపాన్ని బయటపెట్టే గాంధారి పాత్రలో తాప్సీ ఒంటిచేత్తో రచ్చ చేయబోతున్నారని సమాచారం.
కనికా థిల్లాన్ - తాప్సీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్
{{/usCountry}}ఒక తల్లి తన కూతురి రక్షణ కోసం, ఆమెను కాపాడుకోవడం కోసం ఏ స్థాయికైనా తెగించే ఇంటెన్స్ మదర్-డాటర్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. సమాజంలో మంచివాళ్లలా నటిస్తూ ముసుగులు వేసుకున్న క్రూరుల అసలు స్వరూపాన్ని బయటపెట్టే గాంధారి పాత్రలో తాప్సీ ఒంటిచేత్తో రచ్చ చేయబోతున్నారని సమాచారం.
కనికా థిల్లాన్ - తాప్సీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్
{{/usCountry}}తాప్సీ పన్ను, పవర్‌ఫుల్ రైటర్ కనికా థిల్లాన్ కాంబినేషన్‌కు బాలీవుడ్‌లో స్పెషల్ ఇమేజ్ ఉంది. గతంలో వీరి కలయికలో వచ్చిన 'హసీన్ దిల్‌రుబా', 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా', 'మన్‌మర్జియా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర, ఓటీటీలో సంచలన విజయాలు సాధించాయి.
ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో 'గాంధారి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కనికా థిల్లాన్ సొంత ప్రొడక్షన్ బ్యానర్ 'కథా పిక్చర్స్' (Kathha Pictures) బ్యానర్‌పై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఈ సినిమాకు 'భోంస్లే', 'జోరమ్' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఇంటెన్స్ చిత్రాలను అందించిన దేవశిష్ మఖీజా (Devashish Makhija) దర్శకత్వం వహించారు. ఆయన మార్క్ రియలిస్టిక్ డార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ సీన్లు ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.
తాప్సీతో పాటు ఈ సినిమాలో ఇష్వాక్ సింగ్, మీతా వశిష్ట్, స్వస్తిక ముఖర్జీ, ఛాయా కదమ్, జటిన్ సర్నా, చందన్ రాయ్ లాంటి టాలెంటెడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షార్ పోలీస్, క్లింటన్ సెరెజో అందించిన మ్యూజిక్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ప్రొడక్షన్ టీమ్ చెబుతోంది.
సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ధమాకా
సెప్టెంబర్ 3న డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ ఓటీటీ ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. రివేంజ్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ సెప్టెంబర్ నెలలో గాంధారి ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్ కానుంది.