నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసిన ఓటీటీ..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి మరో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని గురువారం (జులై 17) మేకర్స్ అనౌన్స్ చేశారు. దేశ రక్షణలో గూఢాచారుల పాత్రను హైలైట్ చేస్తూ సాగే సిరీస్ ఇది.
నెట్‌ఫ్లిక్స్ థ్రిల్లర్ సిరీస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రతీక్ గాంధీ నటించిన తాజా వెబ్ సిరీస్ 'సారే జహాన్ సే అచ్చా' విడుదల తేదీని ప్రకటించారు. మేకర్స్ విడుదల చేసిన కొత్త డేట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో ప్రధాన నటుడు ప్రతీక్ గాంధీ కీలక పాత్రలో కనిపిస్తూ కాస్త డిఫరెంట్ గా ఈ డేట్ అనౌన్స్ చేశారు. ఈ స్పై డ్రామా వచ్చే నెల ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది.

'సారే జహాన్ సే అచ్చా' రిలీజ్ డేట్
'సారే జహాన్ సే అచ్చా' ఆగస్ట్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మేరకు మేకర్స్ ప్రతీక్ గాంధీతో కూడిన ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను గురువారం (జులై 17) విడుదల చేశారు. ఇందులో అతడు గూఢచారి అధికారి విష్ణు శంకర్‌గా కనిపించాడు. మోర్స్ కోడ్‌లో సమాచారాన్ని సేకరిస్తుంటాడు. ఒక గూఢచారికి ప్రతి సమాచారం ఎంత ముఖ్యమన్నది వివరిస్తాడు.
"మా మిషన్ విజయం లేదా వైఫల్యం దానిపై ఆధారపడి ఉంటుంది" అని అతను ఆ వీడియోలో చెబుతూ.. శత్రు దేశమే లక్ష్యమని, వారి స్థావరంలోకి ప్రవేశించి వారిని అణుశక్తిగా మారకుండా ఆపడమే అంతిమ లక్ష్యమని అనడం చూడొచ్చు. అతడు రాసిన మోర్స్ కోడ్ ను డీకోడ్ చేస్తూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని స్క్రీన్ పై చూపించారు. "ఈ ఇండిపెండెన్స్ డే నాడు మా లక్ష్యం స్పష్టం. భారతదేశాన్ని శత్రువు కంటే ఒక అడుగు ముందుంచాలి" అని అతను వీడియోలో చెప్పడం వినిపిస్తుంది.
'సారే జహాన్ సే అచ్చా' గురించి..
1970ల నేపథ్యంలో రూపొందిన ‘సారే జహాన్ సే అచ్చా’లో ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో నటించాడు. సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సన్నీ హిందూజా, సుహైల్ నాయర్, కృతికా కమ్రా, తిలోతమా షోమ్, రజత్ కపూర్, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.
తన పాత్ర గురించి ప్రతీక్ ఒక మీడియా ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము అత్యవసరమైన, తీవ్రమైన, బెదిరింపులతో నిండిన, నిశ్శబ్ద ఉద్రిక్తతతో కూడిన ప్రపంచాన్ని నిర్మించాం" అని అన్నాడు. విష్ణు శంకర్‌ను కర్తవ్యం, నైతికత మధ్య సన్నని దారంపై నడిచే వ్యక్తిగా అతను గుర్తు చేసుకున్నాడు. ఇది ఇటీవలి కాలంలో తన అత్యంత సవాలుతో కూడుకున్న పాత్రలలో ఒకటి అని ప్రతీక్ స్పష్టం చేశాడు. ఈ వెబ్ సిరీస్ లోని ఇతర పాత్రల గురించి సమాచారం ఇంకా వెల్లడించలేదు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



