'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి ఫీల్ గుడ్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు కాంబినేషన్ మళ్లీ వస్తోంది. ఈసారి థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో 'తక్షకుడు' మూవీతో వీళ్లు సందడి చేయనున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ నితాన్షీ గోయల్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది.
తక్షకుడు టీజర్ రిలీజ్

కరోనా సమయంలో థియేటర్లు మూతపడినా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై మన ఇళ్లల్లో నవ్వులు పూయించిన కాంబినేషన్ గుర్తుందా? హీరో ఆనంద్ దేవరకొండ, దర్శకుడు వినోద్ అనంతోజు. ఫ్యామిలీ డ్రామాతో మ్యాజిక్ చేసిన వీరిద్దరూ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో చేతులు కలిపారు. అదే 'తక్షకుడు'. ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం.
అయితే 'తక్షకుడు' కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. థియేటర్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఏకంగా 30 భాషల్లో, పలు దేశాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
అంధుడిగా ఆనంద్.. వెన్నులో వణుకుపుట్టించే టీజర్
మంగళవారం (ఫిబ్రవరి 3) విడుదలైన 'తక్షకుడు' టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో ఆనంద్ దేవరకొండ అంధుడిగా కనిపించడం విశేషం. ఒక గుర్తు తెలియని వ్యక్తి తనను వెంటాడుతుంటే.. సమాధానం లేని ప్రశ్నల కోసం వెతికే యువకుడిగా ఆనంద్ నటన ఆకట్టుకుంటోంది.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా తీసిన దర్శకుడేనా ఈ థ్రిల్లర్ తీసింది అనిపించేలా టీజర్ కట్ ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
టాలీవుడ్‌కి వస్తున్న 'లాపతా లేడీ'
ఇటీవల 'లాపతా లేడీస్' సినిమాతో దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ నటి నితాన్షీ గోయల్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఆమె రాకతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది.
{{/usCountry}}ఇటీవల 'లాపతా లేడీస్' సినిమాతో దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ నటి నితాన్షీ గోయల్ ఈ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఆమె రాకతో సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది.
{{/usCountry}}స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ టీజర్ చూస్తుంటే మాత్రం ఈసారి ఈ కాంబో ఓ రేంజ్‌లో భయపెట్టి, మెప్పించేలా ఉంది. గుంటూరు, నెల్లూరు యాసలతో మనసు గెలుచుకున్న ఆనంద్.. ఈసారి థ్రిల్లర్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
గతంలోనే ఈ తక్షకుడు గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 30 భాషల్లో వివిధ దేశాల్లో స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, ఎక్కువ మంది ఆడియెన్స్ కు చేర్చేందుకు ఇలా చేశామని చెప్పాడు. కొన్ని సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసం ఉంటే.. మరికొన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరేందుకు ఓటీటీ బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు. తక్షకుడు మూవీని 30 భాషల్లో రిలీజ్ చేస్తున్నారంటే.. అందులో అంతలా ఏముంది? అసలు ఆ సినిమా స్టోరీ ఏంటన్నదానిపై చర్చ మొదలైంది.