...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ఆడపిల్లలే వరుస హత్యలు చేస్తే.. థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి..

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ ఏడాది థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమా.. మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ మూవీ విశేషాలేంటో తెలుసుకోండి.

Published on: Oct 21, 2025, 15:16:07 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలోకి ఓ గుజరాతీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ మూవీ పేరు వశ్ లెవర్ 2. థియేటర్లలో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ సీక్వెల్ మూవీ రేపటి నుంచే స్ట్రీమింగ్ కానుంది. గుజరాతీ భాషలో రూపొందిన సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ చిత్రం వశ్ లెవల్ 2 (Vash Level 2). ఇది 2023లో వచ్చిన వశ్ సినిమాకు సీక్వెల్‌గా 2025లో విడుదలైంది.

వశ్ లెవల్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ఆడపిల్లలే వరుస హత్యలు చేస్తే.. థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి..
నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ.. ఆడపిల్లలే వరుస హత్యలు చేస్తే.. థియేటర్లలో సూపర్ హిట్.. ఇప్పుడు ఓటీటీలోకి..

థియేటర్లలో విడుదలైన తర్వాత విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. జానకి బోడివాలా, హితు కనోడియా, మోనాల్ గజ్జర్, హితేన్ కుమార్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. వశ్ లెవల్ 2 ఆగస్టులో థియేటర్లలోకి వచ్చింది. థియేటర్లలో విడుదలైన దాదాపు 2 నెలల తర్వాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమా అక్టోబర్ 22న ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా గుజరాతీ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని మంగళవారం (అక్టోబర్ 21) నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. “భయానక పరిస్థితులు ఉన్నాయి. ఈసారి తప్పించుకోవడం కష్టం. వశ్ లెవల్ 2 అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. అయితే ఈ వశ్ లెవల్ 2 ఓటీటీ రిలీజ్ కంటే ముందే మీరు వశ్ తొలి భాగాన్ని షేమారూమీ (ShemarooMe)లో చూడొచ్చు.

'వశ్ లెవల్ 2' కథ ఏంటంటే?

వశ్ లెవల్ 2 ఒక హారర్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ కథలో పాత విలన్ ప్రతాప్.. 12 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. అతను అథర్వను తన కుమార్తె ఆర్యను, అలాగే అతను హిప్నోటైజ్ చేసిన కొందరు స్కూల్ బాలికలను కాపాడటానికి మళ్లీ తనలోని చెడుతో పోరాడవలసి వస్తుందని బలవంతం చేస్తాడు.

క్లైమాక్స్‌లో అథర్వ ఒక కొత్త గందరగోళాన్ని ఆపడానికి పోరాడుతాడు. ఈ సంఘర్షణ, గతంలో జరిగిన భయానక సంఘటనలతో ముడిపడి ఉంటుంది. నిజానికి హిందీలో వచ్చిన సైతాన్ మూవీ కూడా ఇదే కథతో వచ్చింది. అందులో అజయ్ దేవగన్, మాధవన్ నటించిన విషయం తెలిసిందే.

వశ్ లెవల్ 2లో హితు కనోడియా అథర్వ పాత్ర పోషించగా, విలన్ ప్రతాప్ పాత్రలో హితేన్ కుమార్ తిరిగి వచ్చాడు. అథర్వ కూతురు ఆర్యగా జానకి బోడివాలా, మోనాల్ గజ్జర్, చేతన్ దైయా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కృష్ణదేవ్ యాజ్ఞిక్ దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా అందించాడు. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో వశ్ సినిమా బెస్ట్ గుజరాతీ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. అలాగే జానకి బోడివాలా బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ సపోర్టింగ్ రోల్ అవార్డును కూడా గెలుచుకుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe