తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్ నేరుగా నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ గురువారం ఆ ఓటీటీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఓ అమ్మాయిల సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథలా ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా క్రైమ్ సైకలాజికల్ థ్రిల్లర్ లవర్స్ ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
స్టీఫెన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్

తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టీఫెన్. ఈ సినిమా డిసెంబర్ 5, 2025 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ సినిమా అయినప్పటికీ తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
“మన చేతులకు ఎవరైనా సీరియల్ కిల్లర్ దొరికితే.. మనం అడగాల్సింది ఎందుకు అని కాదు.. ఎవరు అని? స్టీఫెన్ మూవీ డిసెంబర్ 5 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీల్లో కేవలం నెట్‌ఫ్లిక్స్ లో..” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
ఈ పోస్టర్ ఇంట్రెస్టింగా ఉంది. ఇందులో ఆ సీరియల్ కిల్లర్ చేతులకు బేడీలు వేయడం, చుట్టూ అతడు హత్య చేసిన అమ్మాయిల ఫొటోలు, రక్తం మరకలు ఉన్న కత్తిని ఉంచారు.
స్టీఫెన్ మూవీ స్టోరీ ఏంటంటే?
తమిళ మూవీ స్టీఫెన్ గురించి చెప్పాలంటే.. ఇదొక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్. ఒక సైకియాట్రిస్ట్, తాను నేరం చేశానని ఒప్పుకున్న ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తొమ్మిది మంది అమ్మాయిలు అదృశ్యమయ్యాక, ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు.. ఆ కిల్లర్ నిజంగా దోషా? లేక ఏదైనా పెద్ద కుట్రలో బాధితుడా? అనే కోణంలో సినిమా సాగుతుంది. మోసం, మైండ్ గేమ్స్ చుట్టూ ఈ సినిమా ఉంటుందని దర్శకుడు మిథున్ బాలాజీ చెప్పాడు.
అతనికి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ మూవీలో గోమతి శంకర్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. టైటిల్ రోల్ అతనిదే. మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్ కూడా ఇందులో ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్, ఇతర వివరాల ప్రకారం ఇది చాలా సీరియస్, డార్క్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సీరియల్ కిల్లర్, ఇన్వెస్టిగేషన్ లాంటి స్టోరీలు మీకు నచ్చితే ఈ స్టీఫెన్ కూడా చూడొచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటంతో దీనికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.
{{/usCountry}}అతనికి ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ మూవీలో గోమతి శంకర్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. టైటిల్ రోల్ అతనిదే. మైఖేల్ తంగదురై, స్మృతి వెంకట్ కూడా ఇందులో ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్, ఇతర వివరాల ప్రకారం ఇది చాలా సీరియస్, డార్క్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సీరియల్ కిల్లర్, ఇన్వెస్టిగేషన్ లాంటి స్టోరీలు మీకు నచ్చితే ఈ స్టీఫెన్ కూడా చూడొచ్చు. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటంతో దీనికి మంచి ఆదరణ లభించే అవకాశం ఉంది.
{{/usCountry}}