Netflix Today Releases October 23rd 2026: ఓటీటీలో వీకెండ్ ఏం చూడాలా అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా నెట్‌ఫ్లిక్స్ శుక్రవారం (అక్టోబర్ 23) ప్రేక్షకులకు మంచి కంటెంట్ తీసుకొచ్చింది. అందులోనూ థ్రిల్లర్ అభిమానులకైతే మంచి విందు భోజనమే. మరి ఈరోజు వచ్చిన ఆ మూవీస్, వెబ్ సిరీస్ ఏవో ఇక్కడ చూడండి.
1. మలయాళం టైమ్-లూప్ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu)

మలయాళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వినూత్న టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు'. సజిన్ గోపు, నిఖిలా విమల్ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
తన పెళ్లి రోజే హత్యకు గురయ్యే హీరో, మళ్లీ మళ్లీ అదే రోజు ఉదయానికి చేరుకోవడం, తన చావు నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులకు పుష్కలంగా నవ్వులు, థ్రిల్‌ను పంచుతాయి. అసలు అలా ఎందుకు జరిగింది? దాని వెనుక ఉన్న అసలు కథేంటి అన్నది ఈ మూవీలో చూడొచ్చు.
2. కీర్తి సురేష్ 'డోరతీ' (Dorothy)
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన ఇంటెన్స్ తమిళ సోషల్ క్రైమ్ డ్రామా 'డోరతీ'. 1990ల కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో కుల వివక్ష, సమాజంలో మహిళలు ఎదుర్కొనే అణచివేత, పాత ఆలోచనలను ధిక్కరించే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ మూవీ చూడొచ్చు.
3. లూపిన్: పార్ట్ 4 (Lupin: Part 4)
గ్లోబల్ వైడ్‌గా కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ మిస్టరీ రివేంజ్ థ్రిల్లర్ 'లూపిన్'. ఒమర్ సై (Omar Sy) ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రాంచైజ్ 4వ భాగం అక్టోబర్ 23న స్ట్రీమింగ్ కు వచ్చింది. అర్సేన్ లూపిన్ అనే జెంటిల్మన్ దొంగ ప్రేరణతో అస్సానే దియోప్ తన తండ్రిపై పడిన నిందను తొలగించుకోవడానికి, శత్రువుల కుట్రలను ఛేదించడానికి చేసే కొత్త మిషన్ ఈ పార్ట్ 4లో చూపించబోతున్నారు.
4. మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్' (Gajab Raat)
{{/usCountry}}గ్లోబల్ వైడ్‌గా కోట్లాది మంది వీక్షకులను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ మిస్టరీ రివేంజ్ థ్రిల్లర్ 'లూపిన్'. ఒమర్ సై (Omar Sy) ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫ్రాంచైజ్ 4వ భాగం అక్టోబర్ 23న స్ట్రీమింగ్ కు వచ్చింది. అర్సేన్ లూపిన్ అనే జెంటిల్మన్ దొంగ ప్రేరణతో అస్సానే దియోప్ తన తండ్రిపై పడిన నిందను తొలగించుకోవడానికి, శత్రువుల కుట్రలను ఛేదించడానికి చేసే కొత్త మిషన్ ఈ పార్ట్ 4లో చూపించబోతున్నారు.
4. మనోజ్ బాజ్‌పాయ్ 'గజబ్ రాత్' (Gajab Raat)
{{/usCountry}}బహుముఖ ప్రజ్ఞాశాలి మనోజ్ బాజ్‌పాయ్, నుస్రత్ భరుచా, సాఖిబ్ సలీమ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'గజబ్ రాత్'. ఒకే ఒక్క రాత్రి వేళ పోలీస్ అధికారి తీసుకునే ఓ తొందరపాటు నిర్ణయం ఎంతటి అనర్థాలకు దారితీసింది? సస్పెన్స్, డార్క్ కామెడీతో కూడిన ఆ రాత్రి మిస్టరీ ఏమిటనేది ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు.
5. సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (Surviving Hurricane Otis)
2023లో మెక్సికోలోని అకాపుల్కో నగరాన్ని వణికించిన భయంకరమైన 'కేటగిరీ-5' హరికేన్ 'ఓటిస్' ఆధారంగా రూపొందించిన నేచురల్ డిజాస్టర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఊహించని విధ్వంసం మధ్య సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి, కుటుంబాలను కాపాడుకోవడానికి చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు.