...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్

నెట్‌ఫ్లిక్స్ లో ఈ ఏడాది అంటే 2025లో ఎన్నో అదిరిపోయే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి వాటిలో టాప్ 10 వెబ్ సిరీస్ ఏవి? వాటిలో మీరు ఎన్ని చూశారో చూడండి. చూడకపోతే ఈ ఇయర్ ఎండ్ లోపు ప్లాన్ చేసుకోండి.

Published on: Dec 28, 2025, 09:53:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఈ ఏడాది అంటే 2025లో నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి వెబ్ సిరీస్ అందించింది. హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్.. ఇలా అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ సిరీస్‌లు వచ్చాయి. ఈ ఏడాది టాప్-10లో నిలిచిన సిరీస్‌లు ఏవో, వాటి కథలేంటో ఇక్కడ చూసేయండి. ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన సిరీస్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. వాటిలో మీరు మిస్ అవ్వకూడని టాప్ 10 లిస్ట్ ఇదే.

1. అడొలసెన్స్ (Adolescence)

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్
నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది వచ్చిన టాప్ 10 వెబ్ సిరీస్ ఇవే.. లిస్టులో థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్

నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన బెస్ సిరీస్ అని చెప్పొచ్చు. బ్రిటిష్ క్రైమ్ డ్రామా అడొలసెన్స్. ఇది మొత్తం 'రియల్ టైమ్' లో సింగిల్ టేక్ షాట్స్‌తో తీశారు. ఏకంగా 8 ఎమ్మీ అవార్డులు గెలుచుకుంది. ఇందులో నటించిన కుర్రాడు ఓవెన్ కూపర్, ఎమ్మీ గెలిచిన అతి పిన్న వయసు యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు.

13 ఏళ్ల కుర్రాడు తన క్లాస్‌మేట్‌ను చంపేస్తాడు. అసలు 'ఎవరు చేశారు' అని కాకుండా 'ఎందుకు చేశాడు' అనే కోణంలో కథ సాగుతుంది. సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద ఎలా ఉందో ఇందులో చూపించారు.

2. మ్యాన్ వర్సెస్ బేబీ (Man vs Baby)

మన మిస్టర్ బీన్ (రోవన్ అట్కిన్సన్) ఈ సిరీస్ తో మళ్లీ వచ్చాడు. ఇది వారానికి 14 మిలియన్ వ్యూస్ సాధించి నెట్‌ఫ్లిక్స్ టాప్ ప్లేస్‌కి వెళ్లింది. కూతురి చదువు కోసం డబ్బులు కావాలని హీరో ఒక ఇంటికి కాపలా ఉండటానికి వెళ్తాడు. కానీ అక్కడ ఒక చిన్న పాపను చూసుకోవాల్సి వస్తుంది. ఆ పాప చేసే రచ్చ, హీరో పడే పాట్లు ఫుల్ కామెడీగా ఉంటాయి.

3. సింగిల్ పాపా (Single Papa)

యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన హిందీ వెబ్ సిరీస్. దీనికి ఈ ఏడాది బెస్ట్ సిరీస్‌గా ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డు వచ్చింది. 80ల నాటి తీహార్ జైలులో జరిగే అవినీతి, పవర్ పాలిటిక్స్ ఎలా ఉండేవో జైలర్ సునీల్ గుప్తా కళ్ళతో చూసినట్టుగా ఉంటుంది.

5. వెన్స్‌డే సీజన్ 2 (Wednesday Season 2)

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. 80కి పైగా దేశాల్లో నంబర్ 1గా నిలిచింది. ఇదో హారర్ కామెడీ వెబ్ సిరీస్. ఈసారి కథ ఐర్లాండ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. హారర్ డోస్ పెంచారు. వెన్స్‌డే ఒక సీరియల్ కిల్లర్ వేటలో పడుతుంది.

6. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (Stranger Things Season 5)

ప్రపంచం మొత్తం ఎదురుచూసిన ఫైనల్ సీజన్. మొదటి 5 రోజుల్లోనే 59.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెక్నాను ఆపడానికి ఫ్రెండ్స్ బ్యాచ్ చేసే చివరి ప్రయత్నం ఇది. విల్ కు అప్-సైడ్ డౌన్ వరల్డ్ నుంచి వచ్చే సంకేతాలు, ఎలెవన్ కోసం ప్రభుత్వం చేసే వేట.. అంతా ఉత్కంఠగా ఉంటుంది.

7. జీరో డే (Zero Day)

లెజెండరీ యాక్టర్ రాబర్ట్ డి నీరో నటించిన మొదటి వెబ్ సిరీస్. అమెరికాపై భారీ సైబర్ అటాక్ జరుగుతుంది. ఈ క్రమంలో మాజీ ప్రెసిడెంట్ ముల్లెన్ (డి నీరో) ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. పొలిటికల్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్లకు పండగే.

8. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Bads of Bollywood)

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన మొదటి సిరీస్. ఇండియాలో నంబర్ 1గా ట్రెండ్ అయ్యింది. ఆస్మాన్ సింగ్ అనే కొత్త హీరో బాలీవుడ్ పాలిటిక్స్, ప్రేమలో పడే ఇబ్బందుల చుట్టూ తిరిగే కథ. బాబీ డియోల్, రాఘవ్ జుయల్ ఇందులో నటించారు.

9. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (Delhi Crime Season 3)

షెఫాలీ షా నటించిన సూపర్ హిట్ సిరీస్ ఇది. గతంలో వచ్చిన రెండు వెబ్ సిరీస్ లలాగే ఇది కూడా ఆకట్టుకుంది. రియల్ లైఫ్ 'బేబీ ఫలక్' కేసు ఆధారంగా తీశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ (మనుషుల అక్రమ రవాణా) నెట్‌వర్క్‌ను ఛేదించడానికి వర్తికా టీమ్ చేసే ఆపరేషన్ ఇది.

10. వెన్ లైఫ్ గివ్స్ యు టాంజరిన్స్

కొరియన్ డ్రామా ఇది. ఐయూ (IU), పార్క్ బో-గమ్ నటించారు. టైమ్ మ్యాగజైన్ దీన్ని 'బెస్ట్ K-డ్రామా ఆఫ్ 2025' అని పొగిడింది. జెజు ఐలాండ్ అందాలు, అక్కడి కల్చర్ మధ్య సాగే ఒక అందమైన, ఎమోషనల్ జర్నీ ఇది. యుద్ధం, పేదరికం దాటుకుని గెలిచిన జంట కథ.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks